Special Buses To Srisailam : శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్, ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఏపీఎస్ఆర్టీసీ

Best Web Hosting Provider In India 2024

Special Buses To Srisailam : మహాశివరాత్రి (Maha Shiva Ratri 2024)పర్వదినం సందర్భంగా శ్రీశైలం(Srisailam) మల్లన్న క్షేత్రంలో అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. దూర ప్రాంతాల నుంచి శ్రీశైలం వచ్చే భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. మల్లిఖార్జునస్వామి, భ్రమరాంబిక తల్లిని దర్శించుకునేందుకు శివరాత్రి నాడు పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీశైలానికి వస్తుంటారు. మహాశివరాత్రి రోజున భక్తుల రద్దీని దృష్టిలో ఏపీఎస్ ఆర్టీసీ(APSRTC Buses) కీలక ప్రకటన చేసింది. కర్నూలు డిపో నుంచి శ్రీశైలం క్షేత్రానికి ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతోంది. కర్నూలు డిపో నుంచి 310 బస్సు సర్వీసులను శ్రీశైలం క్షేత్రానికి నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. కర్నూలు మీదుగా శ్రీశైలం వెళ్లే భక్తులు ఈ బస్సు సర్వీసులను వాడుకోవాలని అధికారులు తెలిపారు. మార్చి 5న తేదీ నుంచి ఈ ప్రత్యేక బస్సు సర్వీసులు ప్రారంభం అయ్యాయి. శ్రీశైలంలో మార్చి11 వరకు శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. మార్చి 12వ తేదీ వరకూ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. కర్నూలు డిపో నుంచి వెంకటాపురం వరకు రూ.150 ఛార్జీలు వసూలు చేయనున్నట్లు తెలిపారు. రద్దీ దృష్ట్యా మరిన్ని సర్వీసులు అందుబాటులోకి తేస్తామన్నారు.

 

ట్రెండింగ్ వార్తలు

దోర్నాల గేట్లు ఓపెన్

శ్రీశైలం మల్లన్న దర్శనానికి శివరాత్రి సమయంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అయితే రాత్రి 9 తర్వాత దోర్నాల వద్ద ఫారెస్ట్ అధికారులు గేట్లు మూసివేస్తుంటారు. రాత్రి సమయంలో శ్రీశైలానికి (Srisailam)వాహనాలను అనుమతించరు అటవీ అధికారులు. ఎన్నో ఏళ్ల నుంచి ఈ విధానం అమలు చేస్తున్నారు. రాత్రి 9 గంటలకు మూసేసిన గేట్లను తిరిగి ఉదయం 6 గంటల తర్వాత తెరుస్తారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా అయితే భక్తుల తాకిడి దృష్ట్యా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో దోర్నాలలో ఫారెస్ట్ గేట్లను(Srisailam Forest Gates) ముసివేయకూడదని నిర్ణయించారు. శ్రీశైలం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి వాహనాలను అనుమతించాలని శ్రీశైల దేవస్థానం, అటవీ అధికారులను కోరింది. దీంతో మార్చి 11వ తేదీ వరకూ గేట్లు క్లోజ్ చేయమని, అందుకు తగిన అనుమతులు ఇచ్చారు అటవీ అధికారులు.

వేములవాడ రాజన్న దర్శనానికి ప్రత్యేక బస్సులు

తెలంగాణలోని వేములవాడ రాజన్న (Vemulawada Rajanna Temple) ఆలయానికి మహా శివరాత్రి సమయంలో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. భక్తుల సౌకర్యం కోస టీఎస్ఆర్టీసీ(TSRTC Special Buses) 1000 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఈ నెల 7న 265 ప్రత్యేక బస్సులు, 8న 400, 9న 329 బస్సులను నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ బస్సులు వరంగల్, హన్మకొండ, కరీంనగర్‌‌‌‌‌‌‌‌, నిజామాబాద్‌‌‌‌, సిరిసిల్ల, నర్సంపేట, కోరుట్ల, మెట్​పల్లి, ఆర్మూర్‌‌‌‌‌‌‌‌, కామారెడ్డి, నిర్మల్, వేములవాడ డిపోల నుంచి నడుపుతున్నట్లు తెలిపారు. ఈ మూడు రోజులు వేములవాడ బస్టాండ్ నుంచి ఆలయం వరకు దేవాలయం సౌజన్యంతో ఉచితంగా 14 మినీ బస్సులను ఏర్పాటు చేస్తున్నారు.

 

 

 
WhatsApp channel
 

సంబంధిత కథనం

టాపిక్

 
 
KurnoolSrisailamMaha Shivaratri 2024Lord ShivaShivaratriAndhra Pradesh NewsApsrtc

Source / Credits

Best Web Hosting Provider In India 2024