YSRCP Nandigama :
ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.09-12-2022(శుక్రవారం) ..
ఆదర్శవంతమైన పరిపాలనతో .. సగర్వంగా ప్రజల ముందుకు ..
పట్టణంలోని 2 వ వార్డులో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం” నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
నందిగామ పట్టణంలోని 2 వ వార్డు లో శుక్రవారం సాయంత్రం “గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం”లో భాగంగా శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ప్రతి ఇంటికీ తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను -పనితీరును వివరించారు ,
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు ఇచ్చిన వాగ్దానాలు విస్మరించి మోసం చేస్తే . ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారని .. ఆ వివరాలతో మీ ముందుకు సగర్వంగా వస్తున్నామన్నారు , గతంలో ఏ పాలకులు మీ కుటుంబానికి మేము చేసిన సాయం ఇది అని కరపత్రాలు ముద్రించి ఇచ్చిన దాఖలాలు లేవని -ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం మేము చేస్తున్న మంచిని -అందిస్తున్న పాలనను తెలిసేలా ప్రతి ఏటా కరపత్రాలు ముద్రించి మరీ ప్రజల ముందుకు పంపుతున్నారని తెలిపారు ,సంక్షేమ పథకాలు మాత్రమే కాదని అభివృద్ధి కూడా చేసి చూపుతున్నామని చెప్పారు , అత్యంత రద్దీగా ఉండే సీఎం రోడ్డును సైతం విస్తరించి అభివృద్ధి చేస్తున్నామన్నారు ,అభివృద్ధి సంక్షేమమే ఎజెండాగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని గుర్తు చేశారు ,మహిళలకు నామినేటెడ్ పదవుల్లో 50% రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు, మంచి మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ప్రతి ఒక్కరు అండగా నిలవాలని కోరారు ..
ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ ఏఈ, కౌన్సిల్ సభ్యులు రాము , కో ఆప్షన్ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వాలంటీర్లు ,సచివాలయ సిబ్బంది ,పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు ..