Best Web Hosting Provider In India 2024
Netflix OTT Releases: నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈనెల (మార్చి) కొన్ని పాపులర్ సినిమాలు స్ట్రీమింగ్‍కు రానున్నాయి. ఓటీటీ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు అడుగుపెట్టనున్నాయి. ఫైటర్ సహా మరిన్ని చిత్రాలు రానున్నాయి. అలా.. ఈ నెల నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానున్న ముఖ్యమైన సినిమాలు ఏవో ఇక్కడ చూడండి.
ట్రెండింగ్ వార్తలు
అన్వేషిప్పిన్ కండేతుమ్
టోవినో థామస్ హీరోగా నటించిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ అన్వేషిప్పిన్ కండేతుమ్ చిత్రం మంచి హిట్ అయింది. ఫిబ్రవరి 9న మలయాళం థియేటర్లలో రిలీజైన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. డార్విన్ కురైకోస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మర్డర్ మిస్టరీని ఛేదించే పోలీస్ ఆఫీసర్‌గా టోవినో ఈ చిత్రంలో నటించారు. అన్వేషిప్పిన్ కండేతుమ్ సినిమా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో మార్చి 8వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లోనూ ఈ మూవీ మార్చి 8న స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వస్తుంది.
మేరీ క్రిస్మస్
మేరీ క్రిస్మస్ మూవీ జనవరి 12వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. తమిళ వైవిధ్య స్టార్ నటుడు విజయ్ సేతుపతి, బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. మిస్టరీ థ్రిల్లర్‌గా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు శ్రీరామ్ రాఘవన్. ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. మేరీ క్రిస్మస్ మూవీ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో మార్చి 8వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుందని తెలుస్తోంది. హిందీ, తమిళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి.
లాల్ సలామ్
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కీలక పాత్ర పోషించిన లాల్ సలామ్ సినిమా ఫిబ్రవరి 9వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది. రజినీ కూతురు ఐశ్వర్య ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీకి దర్శకత్వం వహించారు. ఈ లాల్ సలామ్ చిత్రం మార్చిలోనే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి రానుంది. మార్చి 8న స్ట్రీమింగ్‍కు వస్తుందని సమాచారం. అయితే, అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మర్డర్ ముబారక్
మర్జర్ ముబారక్ హిందీ సినిమా మార్చి 15వ తేదీన నేరుగా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అడుగుపెట్టనుంది. ఈ మిస్టరీ థ్రిల్లర్ థియేటర్లలో రిలీజ్ కాకుండా.. డైరెక్టుగా ఓటీటీ స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది. పంకజ్ త్రిపాఠి, సారా అలీఖాన్, విజయ్ వర్మ, డింపుల్ కపాడియా, కరిష్మా కపూర్, సంజయ్ కపూర్ ఈ మూవీలో కీలకపాత్రలు పోషించారు. సస్పెన్స్, కామెడీ, రొమాన్స్ అంశాలతో ఈ మూవీ ఉండనుంది. క్లబ్ యూ టూ డెత్ పుస్తకం ఆధారంగా మర్డర్ ముబారక్ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు హోమీ అడజానియా.
ఫైటర్
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, దీపికా పదుకొణ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఫైటర్ చిత్రం జనవరి 25వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఏరియల్ యాక్షన్ మూవీగా వచ్చిన ఈ సినిమా హిట్ అయింది. ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ సుమారు రూ.350 కోట్ల వసూళ్లను దక్కించుకుంది. ఫైటర్ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ మార్చి 21వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వస్తుందని అంచనాలు ఉన్నాయి.
టాపిక్