Lineman: కన్నడలోకి ఎంట్రీ ఇస్తోన్న తెలుగు హీరో.. ఆకట్టుకుంటున్న లైన్ మ్యాన్

Best Web Hosting Provider In India 2024

Lineman Movie In Kannada: తెలుగు, తమిళ సినిమాల్లో విభిన్నమైన సినిమాలు చేస్తూ తనదైన ఇమేజ్ సంపాదించుకున్న హీరో త్రిగుణ్ (అరుణ్ అదిత్) (Thrigun). ఇప్పుడీ హీరో లైన్ మ్యాన్ చిత్రంతో కన్నడ సినీ ఇండస్ట్రీలోనూ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. వీ రఘుశాస్త్రి దర్శకత్వంలో తెరకెక్కిన లైన్ మ్యాన్ సినిమాను కన్నడ, తెలుగు భాషల్లో విడుదల రిలీజ్ చేస్తున్నారు. మాండ్య ప్రాంతంలోని సమీప గ్రామాల్లోనిఅక్కడి వాతావరణాన్ని చక్కగా ఆవిష్కరిస్తూ కామెడీ ప్రధానంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.

 

ట్రెండింగ్ వార్తలు

రీసెంట్‌గా విడుదలైన లైన్ మ్యాన్ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వచ్చింది. బుధవారం (మార్చి 6) లైన్ మ్యాన్ మూవీ ట్రైలర్‌ను (Lineman Trailer) మేకర్స్ విడుదల చేశారు. నటరాజ్ అనే జూనియర్ లైన్ మ్యాన్ ఇంట్రడక్షన్‌తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. గ్రామంలో అందరూ నటరాజ్‌ను నట్టు అని పిలుస్తుంటారు. పవర్ స్టార్ రెఫరెన్స్‌తో నటరాజ్ ఇంట్రడక్షన్ ఉంది. అలాగే గ్రామంలోని ఇతర పాత్రలను కూడా ఇందులో పరిచయం చేశారు.

త్రిగుణ్‌కి ఎదురయ్యే ప్రశ్నలు నవ్వు తెప్పించేలా ఉన్నాయి. ఆ గ్రామంలో దేవుడమ్మ వెయ్యికి పైగా కాన్పులను చేసుంటుంది. ఆమె100వ పుట్టినరోజును జరుపుకోవటానికి గ్రామస్థులందరూ సిద్ధమవుతారు. అదే సమయంలో గ్రామంలోని వారంత కరెంట్ లేకుండా నాలుగు రోజులు ఉండటానికి నిర్ణయించుకుంటారు. ఆ నిర్ణయానికి కారణమేంటని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్. ట్రైలర్‌లో తెలియని ఆహ్లదంతో పాటు తెలియని గందరగోళం ఉందని తెలుస్తుంది.

లైన్ మ్యాన్ అయిన త్రిగుణ్ ఎందుకని గ్రామానికి కరెంట్ ఇవ్వకుండా ఆపేస్తాడు.. అనేది అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది. అది తెలియాలంటే మార్చి 15న విడుదలవుతున్న మూవీ చూడాల్సిందే అని మేకర్స్ తెలిపారు. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషనల్ రోలర్ కోస్టర్ ప్యాక్డ్‌గా సినిమా ఉంటుందని చెబుతున్నారు. మార్చి 15న లైన్ మ్యాన్ చిత్రం తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.

 

ఈ సినిమాతో త్రిగుణ్ కన్నడ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వటమే కాదు.. ప్రాంతీయ సినిమాకున్న హద్దులను సైతం చేరిపేసే ప్రయత్నం చేస్తున్నారు. మాండ్య బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం కచ్చితంగా ఆడియెన్స్‌కు నచ్చుతుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. త్రిగుణ్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో ఇంకా కాజల్ కుందెర్, బి. జయశ్రీ, నివిక్ష నాయుడు, హరిణి శ్రీకాంత్, సుజయ్ శాస్త్రి, అపూర్వ శ్రీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

ప్రెస్టీజియస్ పర్పల్ రాక్ ఎంటర్‌టైనర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న లైన్ మ్యాన్ చిత్రానికి ప్రచూర. పి, కాద్రి మణికాంత్, జ్యోతి రఘుశాస్త్రి, భళా స్టూడియో సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. శాంతి సాగర్ హెచ్.జి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, రఘునాథ ఎడిటర్‌ వర్క్ చేస్తున్నారు. కాద్రి మణికాంత్ సంగీతం అందిస్తున్నారు. కాగా త్రిగుణ్ ఇదివరకు కొండా, 24 కిస్సెస్, డియర్ మేఘ, కథ కంచికి మనం ఇంటికి, ఎల్ 7, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, చీకటి గదిలో చితక్కొట్టుడు వంటి సినిమాల్లో హీరోగా చేశాడు.

WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024