Best Web Hosting Provider In India 2024

Sai Pallavi: శివకార్తికేయన్, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న అమరన్ మూవీ షూటింగ్ కూడా పూర్తికాకముందే ఓటీటీ హక్కులు అమ్ముడుపోయాయి. రికార్డు ధరకు ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నది. 55 కోట్లకు కొనుగులు చేసినట్లు సమాచారం. ఈ సినిమా ఓటీటీ హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్‌తో పాటు అమెజాన్ ప్రైమ్ పోటీపడ్డట్లు తెలిసింది.
ట్రెండింగ్ వార్తలు
చివరకు నెట్‌ఫ్లిక్స్ భారీ రేట్‌కు హక్కులను సొంతం చేసుకున్నదని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. శివకార్తికేయన్‌తో పాటుసాయిపల్లవి కెరీర్‌లో అత్యధిక ధరకు ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయిన మూవీగా అమరన్ నిలిచింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ హక్కులు మొత్తం నెట్‌ఫ్లిక్స్ కే దక్కినట్లు తెలిసింది.
కమల్ హాసన్ ప్రొడ్యూసర్…
యాక్షన్ వార్ డ్రామా కథాంశంతో తెరకెక్కుతోన్న అమరన్ సినిమాకు విలక్షణ నటుడు కమల్‌హాసన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. సోనీ పిక్చర్స్‌తో కలిసి కమల్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
తమిళనాడుకు చెందిన ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా అమరన్ మూవీ తెరకెక్కుతోంది. ముకుంద్ వరదరాజన్ జీవితంపై ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్ పేరుతో ఓ బుక్ ప్రచురితమైంది. ఆ బుక్‌లోని అంశాలతో అమరన్ మూవీని దర్శకుడు రాజ్‌కుమార్ పెరియాసామి రూపొందిస్తోన్నాడు. 2014లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ముకుంద్ కన్నుమూశాడు.
శివకార్తికేయన్ భార్యగా…
అమరన్ సినిమాలో ముకుంద్ పాత్రలో శివకార్తికేయన్ కనిపించనుండగా…అతడి భార్య రెబెకా వర్గీస్ పాత్రను సాయిపల్లవి చేస్తోంది. సాయిపల్లవి ఛాలెంజింగ్ క్యారెక్టర్‌లో కనిపించనుందని అంటున్నారు.
దాదాపు 150 కోట్ల బట్జెట్‌తో అమరన్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం శివకార్తికేయన్ 30 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. సాయిపల్లవి పది కోట్ల వరకు రెమ్యునరేషన్ స్వీకరించినట్లు చెబుతోన్నారు. శివకార్తికేయన్ హీరోగా నటిస్తోన్న 21వ సినిమా ఇది. ఈ సినిమాను నిర్మిస్తూనే ఇందులో ఓ గెస్ట్ రోల్ కమల్‌హాసన్ కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అమరన్ సినిమాలో రాహుల్ బోస్, భువన్ అరోరా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
టీజర్‌పై వివాదం
ఇటీవల అమరన్ టీజర్ రిలీజైంది. అయితే ఈ టీజర్‌లో ఓ మతం వారిని కావాలనే దేశద్రోహులుగా చిత్రీకరించారంటూ టీఎమ్‌జేకే అనే పార్టీ ధర్నాలు చేసింది. అమరన్ సినిమాను బ్యాన్ చేయాలంటూ కేసు వేశారు.
గార్గి తర్వాత…
లేడీ ఓరియెంటెడ్ మూవీ గార్డి తర్వాత సినిమాలకు కొన్ని నెలలు గ్యాప్ ఇచ్చిన సాయిపల్లవి అమరన్ సినిమాను అంగీకరించింది. అమరన్‌తో పాటు తెలుగులో తండేల్ సినిమా చేస్తోంది సాయిపల్లవి. నాగచైతన్య హీరోగా నటిస్తోన్న ఈ సినిమాకు చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. లవ్‌స్టోరీ తర్వాత నాగచైతన్య, సాయిపల్లవి కాంబోలో తెరకెక్కుతోన్న మూవీ ఇది.
బాలీవుడ్ ఎంట్రీ…
ఈ ఏడాది సాయిపల్లవి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నితీష్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రామాయణ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా కనిపించబోతున్నట్లు తెలిసింది. బాలీవుడ్ రామాయణలో రణ్‌భీర్‌కపూర్ హీరోగా నటిస్తోన్నాడు. అలాగే ఆమీర్‌ఖాన్ తనయుడు జునైద్‌ఖాన్ హీరోగా ఎంట్రీ ఇస్తోన్న సినిమాలో సాయిపల్లవి కథానాయికగా ఎంపికైనట్లు ప్రచారం జరుగుతోంది.