Gal Gadot: నాలుగోసారి కుమార్తెకు జన్మనిచ్చిన వండర్ వుమెన్.. ఆమెను చూస్తే అస్సలు నమ్మలేరు!

Best Web Hosting Provider In India 2024

Gal Gadot Welcomes 4th Child: హాలీవుడ్‌లో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌కు ఎంత ఫ్యాన్స్ ఉన్నారో డీసీకి (Disney Cinematic Universe) కూడా అంతే అభిమానులు ఉన్నారు. డిస్నీ సినిమాటిక్ యూనివర్స్ నుంచి సూపర్ హీరో మూవీస్‌గా వచ్చిన ఫ్రాంఛైజీలో వండర్ వుమెన్ ఒకటి. 2017లో వచ్చిన వండర్ వుమెన్ సినిమా ద్వారా హాలీవుడ్‌తోపాటు యావత్ ప్రపంచానికి వండర్ వుమెన్‌గా మారిపోయింది గాల్ గాడోట్.

ట్రెండింగ్ వార్తలు

తన నటన, గ్లామర్, యాక్షన్ సీక్వెన్స్‌తో అదరగొట్టే గాల్ గాడోట్ తన నాలుగో కుమార్తెకు జన్మనిచ్చినట్లు తాజాగా ప్రకటించింది. సోషల్ మీడియాలో తన పాప ఫొటోను షేర్ చేస్తూ ప్రకటించడంతో అభిమానులు, ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఎందుకంటే తాను మళ్లీ ప్రెగ్నెంట్ అయిన విషయం పెద్దగా తెలియదు. ఇప్పుడు ఒక్కసారిగా నాలుగో సారి తల్లి అయినట్లు ప్రకటించడంతో ఈ వార్త ఆమె అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఆసుపత్రి బెడ్‌లో తన పాపను హత్తుకుని ప్రేమగా ముద్దాడుతున్న ఫొటోను షేర్ చేసింది గాల్ గాడోట్. తన పాప పేరును తెలుపుతూ ఎమోషనల్ నోట్ కూడా రాసుకొచ్చింది మై స్వీట్ గర్ల్ వెల్ కమ్ హోమ్. ప్రెగ్నెన్సీ అనేది సులభం కాదు. చాలా కష్టమైంది. అది నేను దానిని పూర్తి చేశాను. నువ్ మా జీవితాల్లోకి మరిన్ని వెలుగులు తీసుకొచ్చావ్ ఓరి. ఓరి అంటే హిబ్రూలో ‘నా కాంతి’ అని అర్ధం. మేము ఎంతో కృతజ్ఞతతో ఉన్నాం. హౌజ్ ఆఫ్ గర్ల్స్‌కి స్వాగతం. డాడీ కూడా బాగున్నాడు” అని గాల్ గాడోట్ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది.

ఇదిలా ఉంటే, గాల్ గాడోట్ 2008లో జారోన్ వర్సన్‌ను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు 2011లో మొదటి కుమార్తె అల్మా జన్మించింది. అనంతరం రెండో కుమార్తె మాయను 2017లో ప్రసవించింది గాల్ గాడోట్. మూడో కుమార్తె డానియెల్లాకు 2021లో స్వాగతం పలికారు. ఇప్పుడు గాల్ గాడోట్ తన నాలుగో కుమార్తెకు జన్మనిచ్చింది. ఆమెకు ఓరి అని నామకరణం కూడా చేసేసింది. దీంతో గాల్ గాడోట్‌కు అభిమానులు, సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

కంగ్రాట్స్ అంటూ కాజల్ అగర్వాల్ శుభాకాంక్షలు తెలియజేసింది. అలాగే “వండర్ ఉమెన్స్ వండర్ చైల్డ్” అని ఒక నెటిజన్ రాసుకొచ్చాడు. “వావ్! మీరు సూపర్ ఉమెన్. అభినందనలు” అని మరొకరు చెప్పారు. “ఎ క్వీన్ విత్ ఎ ప్రిన్సెస్” అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇదిలా ఉంటే గాల్ గాడోట్ తన సినిమాల్లో ఎంతో గ్లామర్‌గా ఉంటూనే యాక్టింగ్, ఫైటింగ్స్‌తో అలరిస్తుంటుంది. ఇప్పటికీ ఎంతో ఫిట్‌గా ఉంటూ చాలా హాట్‌గా కనపిస్తుంది.

అలాంటి 38 ఏళ్ల గాల్ గాడోట్ నలుగురి పిల్లల తల్లి అంటే చాలామందికి నమ్మడానికి కష్టం. ఇకపోతే గాల్ గాడోట్ ఇంట్లో అందరూ అమ్మాయిలే. తనకు ఇప్పుడు నాలుగోసారి కూడా అమ్మాయే జన్మించింది. కాగా గాల్ గాడోట్ చివరిగా హార్ట్ ఆఫ్ స్టోన్ అనే ఓటీటీ మూవీతో ప్రేక్షకులను అలరించింది. ఇందులో ఆర్ఆర్ఆర్ సీత అలియా భట్ కీ రోల్ ప్లే చేసింది. అలియా భట్ హాలీవుడ్ డెబ్యూ చేసిన సినిమా ఇదే. హార్ట్ ఆఫ్ స్టోన్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024