YSRCP Nandigama :  ఉచిత కోచింగ్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే గారు , ఎమ్మెల్సీ గారు ..

YSRCP Nandigama :

 

 

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.10-12-2022(శనివారం) ..

ఉచిత కోచింగ్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు , ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..

ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు , విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతి రానా టాటా ..

నందిగామ నియోజకవర్గ నిరుద్యోగ యువత, విద్యార్థులు ఉద్యోగాలు పొంది ఉన్నత స్థాయికి రావాలనే ఆలోచన తోనే ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశాం : ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..

ఉద్యోగ సాధించాలనే పట్టుదల -కృషి తో చదివి విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలి : ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..

పేద విద్యార్థులకు ఉన్నత స్థాయి కోచింగ్ భారం కాకూడదని ఎమ్మెల్యే- ఎమ్మెల్సీలైన మొండితోక బ్రదర్స్ ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం అభినందనీయం : జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు ..

యువత ఫోన్లు ,టీవీలు, సినిమాలు, షికారులపై దృష్టి సారించకుండా , ఉద్యోగ సాధించాలి ,జీవితంలో ఉన్నత స్థాయికి రావాలి అనే ఆలోచనతో పట్టుదలతో చదవాలి : సిపి క్రాంతి రానా టాటా ..

ఎన్నో లక్షల వ్యయంతో ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు సోదరులు ఏర్పాటుచేసిన ఉచిత కోచింగ్ సెంటర్ ను యువత ,విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి : పలు విద్యాసంస్థల అధినేతలు ..

కోచింగ్ కు అవసరమైన బుక్స్ అండ్ మెటీరియల్ , 70 రోజుల పాటు మధ్యాహ్న భోజనం ఉచితంగా అందజేస్తున్నాం .. దాదాపు 400 మంది విద్యార్థులు తొలిరోజు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు : ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..

మా అమ్మగారు కస్తాల మరియమ్మ మమ్మల్ని అందరినీ చదివించి , ఉద్యోగులుగా తీర్చిదిద్దింది .. ఆమె స్ఫూర్తితోనే నందిగామ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశాం : ఎమ్మెల్సీ డాక్టర్ అరుణ్ కుమార్ గారు ..

మంచి చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చాం .. నందిగామ నియోజకవర్గానికి మేము ఎంత సేవ చేయగలమో .. అంత సేవ చేస్తాం ..

కోచింగ్ సెంటర్ నిర్వహణకు ఓసి క్లబ్ ను వినియోగించుకోమని సూచించిన చిరుమామిళ్ళ చిన్ని ,నిర్వహణలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న అధ్యాపకులు వాసుదేవరావు లకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం : ఎమ్మెల్సీ డాక్టర్ అరుణ్ కుమార్ గారు ..

రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ప్రఖ్యాతిగాంచిన పి జె ఆర్ కోచింగ్ సెంటర్ అధ్యాపక బృందంతో ఉచిత కోచింగ్ సెంటర్ ను నడిపిస్తున్నాం .. కోచింగ్ సెంటర్ అధినేత జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది పోలీసు ఉద్యోగాలకు ఎంపికయ్యారు ..

నిరుద్యోగ యువత కోసం ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటుచేసిన ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు , ఎమ్మెల్సీ డాక్టర్ అరుణ్ కుమార్ లు అభినందనీయులు : నిరుపేద విద్యార్థులు -యువత ..

ఎమ్మెల్యే -ఎమ్మెల్సీ సోదరులు ఏర్పాటుచేసిన ఉచిత కోచింగ్ సెంటర్ లో మెరుగైన శిక్షణ ఇచ్చి ఎక్కువమంది ఉద్యోగాలు పొందేలా కృషి చేస్తాం : పిజిఆర్ కోచింగ్ సెంటర్ అధినేత ..

జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, సిపి క్రాంతి రానా టాటాలను ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు , ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..

కోచింగ్ సెంటర్ ఏర్పాటులో నిరంతరం శ్రమించిన నరేంద్ర (నాని) , సత్యనారాయణ, నరసింహ లను అభినందిస్తున్నాం ..

ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల అధినేతలు కెవిఆర్ రాయప్ప, చైతన్య రమేష్- కార్తీక్ , తేజ డివిఆర్ ఆళ్ళ రాంబాబు, జీడి ఎంఎం ప్రసాద్ , కాకతీయ రవీంద్ర , ఆర్డిఓ రవీంద్ర ,నాలుగు మండలాల, ఎంపీపీలు జడ్పిటిసిలు , పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *