International women’s day Wishes: మీ జీవితంలోని ప్రతి మహిళ అమూల్యమే, వారికి ఇలా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పండి

Best Web Hosting Provider In India 2024

International women’s day Wishes: సృష్టికే అందం మహిళ. మనిషి చరిత్రకు మొదలు మహిళే. ఎంతటి చరిత్ర సృష్టించిన మొనగాడైనా ఒక స్త్రీకి కొడుకే. ఎంత మంది కొడుకులు ఉన్నా… కూతురు చూపించే ప్రేమే వేరు. తల్లిగా, భార్యగా, కూతురిగా, సోదరిగా… ఆమె చూపించే ప్రేమ ముందు ఎంత కష్టమైనా దూదిపింజలా ఎగిరిపోతుంది. మహిళ గొప్పతనం ఎంత చెప్పినా తక్కువే. ఆమె ఒక అందమైన కావ్యంలాంటిది. ఆమె కోసం ప్రతి ఏడాది వచ్చే దినోత్సవం ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’. మార్చి 8న ప్రపంచమంతా ఈరోజును ఘనంగా నిర్వహించుకుంటుంది. మీ జీవితంలో మీ ఎదుగుదలకు కారణమైన ప్రతి స్త్రీకి ఈరోజున మీరు శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం ఉంది. మహిళా దినోత్సవం రోజున మీ కుటుంబంలోని, జీవితంలోని స్త్రీలకు ఇలా అందంగా తెలుగులోనే శుభాకాంక్షలు చెప్పండి. వీటిని వాట్సాప్ మెసేజుల రూపంలో పంపించండి. మీ వాట్సాప్ స్టేటస్ పెట్టుకోండి.

ట్రెండింగ్ వార్తలు

తెలుగులో మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

1. కుటుంబంలో, జీవితంలో ఉన్న ప్రతి మహిళను గౌరవించడం మన విధి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

2. ప్రతి ఒక్కరి జీవితం స్త్రీతోనే ప్రారంభమవుతుంది.

స్త్రీనే ఈ ప్రపంచం సృష్టికర్త.

అలాంటి స్త్రీని గౌరవించాల్సిన బాధ్యత అందరిదీ.

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

3. ప్రతి స్త్రీ తన కలల సాకారానికి, ఆనందానికి అర్హురాలు.

అలాంటి స్త్రీలందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

4. అమ్మను పూజించు

భార్యను ప్రేమించు

సోదరిని ప్రేమించు

ముఖ్యంగా… మహిళను గౌరవించు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు

5. స్త్రీ ఎక్కడ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు ఉంటారని అర్థం.

అందుకే స్త్రీలను గౌరవిద్దాం, వారికి రక్షణగా నిలబడదాం.

హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే

6. సహనానికి, ఓర్పుకు మారుపేరు తను,

అమ్మా… అని పిలిస్తే ఆదరిస్తుంది.

ఓర్పును, సహనాన్ని పరీక్షిస్తే….

మహాకాళిలా దండిస్తుంది.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు

7. గర్భంలో సృష్టిని దాస్తుంది

గుండెల్లో కొండంత బాధని దాస్తుంది

ఇంతకంటే ఏం చెప్పగలం

ఒక స్త్రీ గొప్పతనం

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

8. కార్యేషు దాసీ

కరణేషు మంత్రీ

భోజ్యేషూ మాతా

ఇలా సమస్తమూ స్త్రీనే.

అలాంటి స్త్రీ మూర్తులందరికీ…

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

9. ఎక్కడైతే మహిళలను గౌరవిస్తారో

అక్కడ దేవతలు కొలువై ఉంటారు

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

10. తల్లిగా జన్మనిచ్చి

అక్కా చెల్లిగా ప్రేమను పంచి

భార్యగా జీవితాన్నే ధారపోసి

బిడ్డగా అనురాగం పంచుతుంది

అలాంటి అనురాగ బంధం స్త్రీమూర్తి

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

11. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా

మహిళా లోకానికి హృదయపూర్వక శుభాకాంక్షలు

హ్యాపీ ఉమెన్స్ డే

12. ఓర్పులో, నేర్పులో తనకు తానే సాటి స్త్రీ

భూదేవి సహనం

రుద్రమ దేవి పరాక్రమం

సీతాదేవి సౌశీల్యం ఉన్న నేటి స్త్రీకి

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

13. ప్రతి పురుషుడి విజయం వెనుక

కచ్చితంగా ఒక స్త్రీ ఉంటుంది

అలాంటి మహిళలందరికీ

హ్యాపీ ఉమెన్స్ డే

14. ప్రపంచంలో మహిళల శక్తి అపారం

స్త్రీ లోకానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

15. ఆకాశమే హద్దుగా అన్ని రంగాల్లో

శరవేగంగా దూసుకుపోతున్న మహిళలకు

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

16. నన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేసిన

నా ప్రియమైన అమ్మకు

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

17. ఆమె కర్త

ఆమె సాధకురాలు

ఆమె విశ్వాసి

ఆమెను గౌరవించాల్సిన బాధ్యత అందరిదీ

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

18. నలుగురి స్త్రీలను నీ జీవితంలో ఎప్పుడూ మరువకు

నిన్ను పుట్టించిన స్త్రీని

నీతో పాటూ పుట్టిన స్త్రీని

నీకోసం పుట్టిన స్త్రీని

నీకు పుట్టిన స్త్రీని

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

19. ఊహ తెలిసిన క్షణం నుంచి

బంధం కోసం, బాధ్యత కోసం

కుటుంబం కోసం…

అందరినీ కనుపాపలా తలచి

ఆత్మీయతను పంచి

తనవారి కోసం అహర్నిశలు శ్రమించి

అవమానాలు భరించి

తన వారి భవిష్యత్తు కోసం

తనను తానే కొవ్వొత్తిలా మార్చుకుంటుంది స్త్రీ

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

WhatsApp channel

టాపిక్

Source / Credits

Best Web Hosting Provider In India 2024