YSRCP Nandigama :
ఎన్టీఆర్ జిల్లా / కంచికచర్ల టౌన్ :
ది.10-12-2022(శనివారం) ..
సిసి రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
రూ.60 లక్షల నిధులతో పట్టణంలోని పలు కాలనీలో సిసి రోడ్ల నిర్మాణం ..
కంచికచర్ల పట్టణంలో మండల పరిషత్ నిధులు రూ.60 లక్షల నిధులతో పలు సిసి రోడ్లు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు భూమి పూజ నిర్వహించారు ,
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వసంత కాలనీల్లో 13 లక్షల రూపాయల నిధులతో, ఇందిరా కాలనీలో 28 లక్షల రూపాయలతో, అరుంధతి నగర్ గోకరాజు పల్లి కాలనీలో 6 లక్షల రూపాయల నిధులతో హనుమాన్ పేటలో 6 లక్షల రూపాయల నిధులతో, అంబేద్కర్ కాలనీలో 7 లక్షల రూపాయల నిధులతో సిమెంట్ రోడ్లు పనులు చేపట్టడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ -ఉపసర్పంచ్ వేల్పుల సునీత -వేమ సురేష్ బాబు, జడ్పిటిసి వేల్పుల ప్రశాంతి , ఎంపీటీసీ నన్నపనేని నరసింహారావు , పలువురు ప్రజాప్రతినిధులు ,అధికారులు ,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు