Best Web Hosting Provider In India 2024
Bhimaa Twitter Review: గోపీచంద్ హీరోగా నటించిన భీమా మూవీ శుక్రవారం థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాతో కన్నడ దర్శకుడు ఏ హర్ష డైరెక్టర్‌గాటాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ప్రీమియర్స్ టాక్ ఎలా ఉంది? ఈ యాక్షన్ మూవీతో గోపీచంద్‌కు హిట్టు దక్కిందా? లేదా? అంటే…
ట్రెండింగ్ వార్తలు
గోపీచంద్ కటౌట్‌కు తగ్గ కథ…
భీమా ఔట్ అండ్ ఔట్ యాక్షన్ మూవీ అని ఓవర్‌సీస్ ఆడియెన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. డ్యూయల్ షేడ్ క్యారెక్టర్‌లో గోపీచంద్ అదరగొట్టాడని అంటున్నారు. పోలీస్ ఆఫీసర్‌గా గోపీచంద్ డైలాగ్స్, యాటిట్యూడ్, బాడీలాంగ్వేజ్ బాగున్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోరోల్ మాస్ కోణంలో సర్‌ప్రైజింగ్‌గా ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ పాత్రలో గోపీచంద్ శివతాండవం చేసేశాడని అంటున్నారు. చాలా రోజుల తర్వాత గోపీచంద్ కటౌట్‌గా తగ్గ మంచి కథ కుదిరించిందని అంటున్నారు. స్క్రీన్‌ప్లే కూడా గ్రిప్పింగ్‌గా ఉందని అంటున్నారు.
యాక్షన్ సీక్వెన్స్ గూస్‌బంప్స్…
యాక్షన్ సీక్వెన్స్‌లు భీమా సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. ప్రతి యాక్షన్ ఎపిసోడ్ గూస్‌బంప్స్‌ను కలిగిస్తుందని చెబుతున్నారు. పరశురామ క్షేత్రానికి సంబంధించిన డివోషనల్ పాయింట్‌ను కూడా దర్శకుడు బాగా రాసుకున్నాడని అంటున్నారు.
భీమాతో గోపీచంద్ మళ్లీ హిట్టు ట్రాక్‌లోకి వచ్చాడని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ష్యూర్‌షాట్ బ్లాక్‌బస్టర్ అంటూ పేర్కొన్నాడు. కింజుసైజ్ కమ్ బ్యాక్ ఇదని చెబుతోన్నారు.
రవి బస్రూర్ బీజీఎమ్…
హీరోయిన్లు ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ ఇద్దరి రోల్స్‌కు ఇంపార్టెన్స్ ఉందని అంటున్నారు. గోపీచంద్, ప్రియా భవానీ శంకర్ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యిందని చెబుతోన్నారు.
కేజీఎఫ్ రవి బస్రూర్ బీజీఎమ్ ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్‌గా నిలిచిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చాలా సీన్స్‌కు తన బీజీఎమ్‌తోనే అతడు ప్రాణం పోశాడని అంటున్నారు.ఓవరాల్‌గా మాస్ ఆడియెన్స్‌కు ఫుల్ మీల్స్‌లా భీమా మూవీ ఉందని చెబుతోన్నారు.భీమా సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ ప్రొడ్యూస్ చేశాడు.
భీమా ప్రీ రిలీజ్ బిజినెస్…
గోపీచంద్ చాలా కాలంగా హిట్టు లేకపోయినా భీమా ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం భారీగానే జరిగినట్లు తెలిసింది. వరల్డ్ వైడ్‌గా పదకొండున్నర కోట్ల వరకు ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ చేసినట్లు సమాచారం. భీమా నైజాం ఏరియా థ్రియేట్రికల్ రైట్స్ మూడున్నర కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలిసింది. ఆంధ్రా ఏరియా మొత్తం కలిసి నాలుగున్నర కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిదిన్నర కోట్ల వరకు భీమా బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఓవర్‌సీస్‌లో రెండు కోట్లకు హక్కులు అమ్ముడుపోయినట్లు సమాచారం.
బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
మొత్తం 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో భీమా సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చినట్లు చెబుతోన్నారు. రీసెంట్ టైమ్‌లో గోపీచంద్ కెరీర్‌లో హయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీగా భీమా నిలిచింది.