Best Web Hosting Provider In India 2024
Premalu Naga Chaitanya Review: ఈ ఏడాది మలయాళంలో ఓ చిన్న సినిమాగా రిలీజై పెద్ద హిట్ సాధించిన మూవీ ప్రేమలు. హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్ లో సాగే ఈ రొమాంటిక్ కామెడీ మూవీ కేరళ బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లకు చేరువవుతోంది. తెలుగులో శుక్రవారం (మార్చి 8) రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రేమలు ప్రీమియర్ షో చూసిన నాగ చైతన్య సోషల్ మీడియాలో తన రివ్యూ ఇచ్చాడు.
ట్రెండింగ్ వార్తలు
గ్యాంగ్‌తో వెళ్లండి.. బాగా నవ్వుకుంటారు: చైతన్య
ప్రేమలు సినిమాపై సోషల్ మీడియా ఎక్స్ లో నాగ చైతన్య స్పందించాడు. “ప్రేమలు మూవీ ఓ ఫన్ బ్లాస్ట్. సిచువేషనల్ కామెడీ చాలా బాగుంది. గ్యాంగ్ తో కలిసి థియేటర్లకు వెళ్లండి. మంచి నవ్వులు గ్యారెంటీ. తెలుగు డబ్బింగ్ వెర్షన్ రేపు రిలీజ్ కానుంది. కార్తికేయ, టీమ్ కు ఆల్ ద వెరీ బెస్ట్” అని నాగ చైతన్య ప్రేమలు రివ్యూ ఇచ్చాడు.
మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ లోబడ్జెట్ మూవీని తెలుగులోకి డబ్ చేశారు. కేవలం రూ.3 కోట్ల బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కింది. అయితే కేరళతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటికే రూ.85 కోట్లు వసూలు చేసింది. దీంతో తెలుగు ప్రేక్షకుల్లోనూ ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. గామి, భీమాలాంటి తెలుగు సినిమాలతో ప్రేమలు పోటీ పడనుంది.
రాజమౌళి కొడుకు తీసుకొస్తున్న ప్రేమలు
ప్రేమలు మూవీని తెలుగులో రాజమౌళి కొడుకు కార్తికేయ రిలీజ్ చేస్తున్నాడు. మలయాళంలో మంచి రెస్పాన్స్ రావడంతో తెలుగుతోపాటు అన్ని దక్షిణాది భాషల్లో సినిమాను రిలీజ్ చేస్తున్నారు. రాజమౌళి తనయుడు రిలీజ్ చేస్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లోనూ క్రేజ్ ఏర్పడింది. నిజానికి ఈ సినిమా ప్రీమియర్ ను రాజమౌళి, అతని కుటుంబం కూడా చూడనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
గురువారం (మార్చి 7) ప్రేమలు మూవీ పెయిడ్ ప్రీమియర్స్ ఏర్పాటు చేయగా.. వీటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మూవీకి ప్రముఖుల నుంచి పాజిటివ్ రివ్యూలు రావడంతో తెలుగులోనూ బాక్సాఫీస్ సక్సెస్ ఖాయమని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్ లోనే తెరకెక్కిన లవ్ స్టోరీ కావడంతో ఇక్కడి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ప్రేమలు ఓటీటీ రిలీజ్ డేట్
ప్రేమలు మూవీకి థియేటర్లలో వస్తున్న రెస్పాన్స్ తో ఓటీటీ రిలీజ్ మరింత ఆలస్యం కానుంది. సాధారణంగా మలయాళ సినిమాలు నెల రోజుల్లోపే ఓటీటీల్లోకి వచ్చేస్తాయి. కానీ ప్రేమలు ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తూ రూ.100 కోట్లకు చేరువవుతుండటంతో మార్చి నెలఖారు లేదంటే ఏప్రిల్లో గానీ ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్రేమలు డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం.
ఇప్పుడు ప్రేమలు మూవీని థియేటర్లలో రిలీజైన 50 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. పైగా తెలుగు వెర్షన్ రిలీజ్ కానుండటం కూడా మూవీ డిజిటల్ ప్రీమియర్ ను మరింత ఆలస్యం చేయనుంది.
టాపిక్