Fake Police In Visakha: ఉద్యోగాల పేరుతో టోకరా.. విశాఖలో నకిలీ పోలీసుల మోసం.. కోట్లలో వసూళ్లు

Best Web Hosting Provider In India 2024

Fake Police In Visakha: . ప్రియురాలితో కలిసి పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి నిరుద్యోగుల్ని మభ్య పెట్టి లక్షలు వసూలు చేశారు. ఒకరికి తెలియకుండా మరొకరి నుంచి దాదాపు రూ.3కోట్లు వసూలు చేశారు. ఉద్యోగాలు రాకపోవడంతో బాధితులు పోలీసులు ఆశ్రయించడం వారి గుట్టు బయట పడింది.

 

ట్రెండింగ్ వార్తలు

పోలీస్‌ శాఖలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి రూ.3కోట్లు వసూలు చేసిన జంటను విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ యూనిఫాంతో ఫోటోలు, పోలీస్ అధికారిగా చలామణీ అవుతూ నిరుద్యోగుల్ని నిండా ముంచాడు.

నిందితుడు ప్రియురాలితో కలిసి అమాయకుల నుంచి రూ.3 కోట్లు వసూలు చేసినట్టు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గుర్తించారు. నిందితుల్ని హైదరాబాద్‌లో తలదాచుకున్నట్టు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

విశాఖలో పోలీస్ యూనిఫాం Police Uniform అడ్డుపెట్టుకుని ఓ జంట నిరుద్యోగుల్ని నిండా ముంచింది. పోలీస్ శాఖలో ఉద్యోగులమని నిరుద్యోగుల్ని నమ్మించిన ఓ జంట దాదాపు 30మంది నుంచి రూ.3కోట్ల రుపాయలు వసూలు చేశారు. పోలీస్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి లక్షలు వసూలు చేశారు. ఇలా పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు డబ్బులు చెల్లించినా ఉద్యోగాలు  Jobs రాకపోవడంతో ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది.

ఘరానా మోసాలకు పాల్పడే పాత నేరస్తుడిగా గుర్తించారు. గతంలో కూడా ఇదే తరహా నేరాలకు పాల్పడిన నిందితుడు తాజాగా ప్రియురాలితో కలిసి పోలీస్ డ్రామాకు తెరతీసినట్టు గుర్తించారు. ఉద్యోగాల పేరుతో అమాయకుల్ని మోసం చేసిన ఘటనలో గతంలో అరెస్టైన నిందితుడు హనుమంతు రమేష్, అతని ప్రియురాలితో కలిసి తాజా మోసానికి పాల్పడినట్టు గుర్తించారు. మరికొంత మందితో కలిసి నిరుద్యోగుల నుంచి దాదాపు రూ. 3 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించారు..

 

ఆర్ధిక నేరాలు, మోసాలకు పాల్పడే హనుమంతు రమేష్‌పై విశాఖపట్నం అడవివరంలోని ఆర్‌ఆర్‌ టవర్స్‌లో ఉంటున్నాడు.ఇటీవల ఓ యువతితో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నాడు. పోలీసు శాఖలో ఉన్నత ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ యువకులకు ఆశ చూపించారు. వీరికి పలువురు మధ్యవర్తులు సహకరించారు.హనుమంతు అతని ప్రియురాలితో కలిసి పోలీస్‌ యూనిఫాంలలో బాధితుల్ని కలిసేవారు. మధ్యవర్తులు కూడా పోలీసులుగా భ్రమింప చేసే వారు. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరి నుంచి దాదాపు 30 మంది నుంచి రూ.3 కోట్ల వసూలు చేవారు.

ఉద్యోగాలు రాకపోవడం, డబ్బులు తీసుకున్న తర్వాత పత్తా లేకుండా పోవడంతో బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులు హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు కమిషనర్‌ సూచనలతో టాస్క్ ఫోర్స్‌ బృందాలు హైదరాబాద్‌ వెళ్లి హనుమంతు రమేష్‌తో పాటు అతడి ప్రియురాలిని అదుపులోకి తీసుకున్నాయి.

నిందితుల్ని విశాఖ పోలీసులు విచారిస్తున్నారు. నిందితుడు రమేష్‌ అక్కా చెల్లెళ్లైన ఇద్దరు యువతుల్ని పెళ్లి చేసుకుని మరో యువతితో కలిసి నేరాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. నేరంలో కుటుంబ సభ్యుల ప్రమేయంపై విచారణ జరుపుతున్నారు. సులువుగా డబ్బు సంపాదించడానికి మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. గతంలో కూడా పలు నేరాలకు పాల్పడటంతో నిందితుడిపై కఠిన చర్యలకు పోలీసులు ఉపక్రమిస్తున్నారు.

 
WhatsApp channel
 

టాపిక్

 
 
Crime NewsCrime ApVisakhapatnamTelugu NewsLatest Telugu NewsBreaking Telugu News

Source / Credits

Best Web Hosting Provider In India 2024