Maha Shivaratri 2024 : శివయ్య నెత్తిన ‘గంగమ్మ’..! మేళ్లచెరువు శివాలయ విశిష్టత తెలుసా

Best Web Hosting Provider In India 2024

Mellacheruvu Sri Swayambhu Shambhu Lingeswara Temple: మహాశివరాత్రి…. హిందువుల పండగల్లో అతి ముఖ్యమైనది. మహాశివరాత్రి(Maha Shivaratri 2024) రోజున అర్ధరాత్రి 12 గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడు లింగ రూపంలో దర్శణమిచ్చే పవిత్ర పర్వదిన కాలం. శివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండి… మనస్సును దైవ చింతన గావిస్తూ రాత్రి సమయంలో శివుడి అనుగ్రహం కొరకు నిదర పోకుండా (జాగరణ) తో మేలుకొని భక్తిశ్రద్ధలతో అభిషేకాలు,పూజలు,భజనలు చేస్తారు. అందుచేత శివరాత్రిగా పిలవబడుతుంది. ఈ పండగ నేపథ్యంలో శివాలయాలన్నీ భక్తులతో నిండిపోతాయి. అందులోనూ పురాతమైన శివాలయాల వద్ద పరిస్థితిని చెప్పాల్సిన అవసరమే లేదు. అలాంటి గొప్ప చరిత్ర కలిగిన వాటిల్లో ఒకటి ‘ శ్రీ శంభు లింగేశ్వర స్వామి టెంపుల్'(Mellacheruvu Mahashivaratri Jatara 2024 :). ఇది సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండల కేంద్రంలో ఉంటుంది. 

ట్రెండింగ్ వార్తలు

కొలిచిన వారికి కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీర్చే శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయాలలో ఒకటి. సూర్యాపేట జిల్లాలోని హుజుర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మేళ్లచెర్వు గ్రామంలో ఉంటుంది. ఈ ఆలయం చాలా చరిత్రతో పాటు పురాతనమైనది. ఇక్కడి ఆలయ నిర్మాణం చూస్తే… కాకతీయ రాజవంశాన్ని ప్రతిబింబిస్తుంది. ఇక్కడి అద్భుత విశేషమేంటంటే… గర్భాలయంలోని శివలింగం ప్రతి 12 సంవత్సరాలకు(పుష్కరం) ఓసారి పెరుగుతుందని భక్తుల నమ్మకం. ఆలయాన్ని సందర్శిస్తే ఇందుకు సంబంధించిన కొన్ని ఆనవాళ్లను కూడా చూపిస్తారు.

శివుడిపై నీళ్లు….

శివలింగం పెరగటమే కాదు… ఇక్కడ మరో వింత కూడా ఉంటుంది. శివలింగం అగ్ర భాగాన అంటే పైభాగన ఒక గుంటలాగా ఉంటుంది. ఆ గుంటలో నుంచి నీరు వస్తుంది. ఆ చోటు నుంచే పూజారులు నీరు తీసి భక్తులకు తీర్థంగా ఇస్తారు. అయితే ఇలా ఎన్నిసార్లు ఆ చిన్న గుంట నుండి నీళ్లు తీసినా… వెంటనే మళ్లీ నిండిపోవటం కనిపిస్తోంది. అంతేకాదు… ఆ గుంట నిండిపోయినప్పటికీ… నీరు అలా నిలిచిపోయి ఉంటుందే కానీ… కిందికి ఏ మాత్రం జారదు. వేసవి, శీతాకాలం ఇలా ఏ సమయమైనా… శివలింగంపై ఉండే నీటిలో ఏ మాత్రం తేడా ఉండదు. ఇదే ఆ స్వయంభు శివలింగం ప్రత్యేకత అని కూడా చెప్పొచ్చు. ఇక గుంటలో ఉండే నీటిని కూడా పూజారులు… దర్శనం సమయంలో అద్దం పెట్టి భక్తులకు చూపిస్తారు. అర్ధనారీశ్వర రూపంలో స్వామివారు ఇక్కడ దర్శనమిస్తారు. శివలింగానికి ఐదు చోట్ల బొట్టు పెట్టినట్లు ఒక మార్కు ఉంటుంది.

5 రోజుల పాటు ఉత్సవాలు….

Mellacheruvu Mahashivaratri Jatara 2024 : మేళ్లచెరువు శివాలయంలో(Mellacheruvu Mahashivaratri Jatara 2024 🙂 ఇవాళ్టి  నుంచి 12 వరకు 5 రోజుల పాటు మహాశివరాత్రి(Maha Shivaratri ) ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోనున్నారు. ఇక్కడ ఎడ్ల పందాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఈ పోటీలలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎడ్లు పోటీల్లో నిలుస్తాయి. లక్ష రూపాయలు విలువ చేసే బహుమతులను అందజేస్తారు. మేళ్లచెరువు జాతరలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఆకర్షణీయంగా నిలుస్తాయి.   పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు.జాతర నిర్వహణ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు.

WhatsApp channel

టాపిక్

Maha Shivaratri 2024SuryapetDevotionalDevotional NewsTelangana NewsTrending Telangana
Source / Credits

Best Web Hosting Provider In India 2024