NNS March 8th Episode: అదిరిపోయిన మిస్సమ్మ రీ ఎంట్రీ.. పిల్లలతో కలిసి ప్లాన్.. నీల అనుమానం, కోపంతో మనోహరి

Best Web Hosting Provider In India 2024

Nindu Noorella Saavasam March 8th Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 8th March Episode) ఇంట్లోనుండి వెళ్లిపోయినట్లు నాటకమాడి అమర్​ని హోటల్​కి రప్పించి పోలీసులకి, మీడియాకి చెప్పి పరువు తీస్తుంది మనోహరి. తన వల్లే మనోహరి క్యారెక్టర్​పై మచ్చపడిందని భావించిన అమర్​ త్వరలోనే తనని పెళ్లి చేసుకుంటా అని మాటిస్తాడు. అదంతా విన్న అరుంధతి బాధపడుతుంది. కావాలనే మనోహరి ఇదంతా చేసిందని తెలుసుకుని కోపంతో రగిలిపోతుంది.

ట్రెండింగ్ వార్తలు

ఎలాగైనా పంపించేయాలి

ఎలాగైనా తన పిల్లలను, కుటుంబాన్ని మనోహరి బారినుండి కాపాడాలి అనుకుంటుంది అరుంధతి. కాళీ ద్వారా నిజం తెలుసుకున్న భాగమతి, రాథోడ్​ ఎలాగైనా మనోహరి ప్లాన్​ తిప్పికొట్టి.. పెళ్లి ఆపాలని నిశ్చయించుకుంటారు. పిల్లలు కూడా మనోహరి తమ తల్లి స్థానంలో ఉండటానికి పనికిరాదని ఎలాగైనా ఆమెను ఇంట్లో నుంచి పంపించి వేయాలని అనుకుంటారు. రామ్మూర్తి తనను ఇంటికి రానిస్తాడో లేదో అనే అనుమానంతో భయం భయంగా ఇంట్లోకి వస్తుంది మంగళ.

తప్పకుండా వెళ్లు

ఎంత ధైర్యం ఉంటే మళ్లీ నా ఇంటికి వస్తావ్​ బయటికి వెళ్లు అని కోప్పడతాడు రామ్మూర్తి. అప్పుడే అక్కడకు వచ్చిన భాగమతి తండ్రిని వారించి మంగళను క్షమించి ఇంట్లోకి వెళ్లమంటుంది. అమర్​, మనోహరి పెళ్లి గురించి తండ్రితో చెప్పి బాధపడుతుంది రామ్మూర్తి. ఎలాగైనా ఆ పెళ్లిని ఆపాలని, అందుకు తాను మళ్లీ ఆ ఇంటికి వెళ్లాలని అంటుంది భాగీ. నిన్ను అంతలా ఆదరించిన కుటుంబానికి కష్టం వస్తే అండగా నిలవాల్సిన అవసరం ఉందమ్మా.. తప్పకుండా వెళ్లు అంటాడు రామ్మూర్తి.

మిస్సమ్మ లేకపోవడం వల్లే

తండ్రీకూతుళ్ల ప్లాన్​ ఏంటో అర్థంకాక ఆలోచిస్తూ ఉంటుంది మంగళ. మెల్లిగా రామ్మూర్తిని పలకరించి తన పెద్ద కూతురు గురించి ఏమైనా తెలిసిందా అని ఆరా తీస్తుంది. కానీ, రామ్మూర్తి కోపం చూసి ఊరికే అడిగానని చెప్పి తప్పించుకుంటుంది. మనోహరి ఆట కట్టించాలని రాథోడ్​, పిల్లలు, భాగమతి కలిసి ఓ ప్లాన్​ వేస్తారు. మిస్సమ్మ లేకపోవడం వల్లే తమకి స్కూల్​కి లేటయిందని అంటారు పిల్లలు. ఇంట్లో మీకు కాబోయే అమ్మ మనోహరి అమ్మగారు ఉండగా ఆ మిస్సమ్మని ఎందుకు కలవరిస్తున్నారు అంటాడు రాథోడ్​.

నీల అనుమానం

అంజలి తెలివిగా మనోహరిని అమ్మా అని పిలుస్తూ పెళ్లివరకు మిస్సమ్మ ఇంట్లో ఉంటే బాగుండు కదా అని అంటుంది. అవును అని మనోహరి అనగానే మిస్సమ్మ డ్యాన్స్​ వేస్తూ అమర్​ ఇంట్లోకి అడుగు పెడుతుంది. కొందరి ఆట కట్టించడానికే తాను తిరిగి వచ్చనంటున్న మిస్సమ్మని చూసి అనుమానపడుతుంది నీల. కానీ, అలాంటిదేం ఉండదంటూ తీసిపడేస్తుంది మనోహరి. ఇంతలో అమర్​, అమర్​ తల్లిదండ్రులు బయటకి వచ్చి మిస్సమ్మ… వచ్చేశావా అంటూ లోపలికి రమ్మంటారు.

రగిలిపోయిన మనోహరి

అమర్​ పిల్లల్ని స్కూల్లో దింపడానికి వెళ్తూ మిస్సమ్మకు బాయ్​ చెబుతాడు. అది చూసి కోపంతో రగిలిపోతుంది మనోహరి. తన పిల్లలను కాపాడేందుకు మిస్సమ్మ తిరిగి రావడం తనకు చాలా ఆనందంగా ఉందని అనుకుంటుంది అరుంధతి. నేరుగా మిస్సమ్మ దగ్గరకు వెళ్లి థ్యాంక్స్​ చెబుతుంది. అరుంధతి ఆత్మ అని మిస్సమ్మకి తెలుస్తుందా? మనోహరి నిజస్వరూపం బయటపెట్టేందుకు మిస్సమ్మ ఏం చేయబోతుంది? అనే విషయాలు తెలియాలంటే మార్చి 9న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024