జగన‌న్న‌ గెలుపు.. ఈ రాష్ట్రంలోని మ‌హిళ‌ల‌ గెలుపు..

Best Web Hosting Provider In India 2024

జ‌గ‌న‌న్న పాల‌న‌లో రాష్ట్రంలోని అక్క‌చెల్లెమ్మ‌లకు గుర్తింపు ల‌భించింది

పార్టీ కోసం ప‌నిచేయ‌డానికే మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్ ప‌ద‌వికి రాజీనామా

వైయ‌స్ఆర్ సీపీ సీనియ‌ర్ నేత శ్రీ‌మ‌తి వాసిరెడ్డి ప‌ద్మ‌ 

వైయ‌స్ఆర్ సీపీ కేంద్ర కార్యాల‌యంలో ఘ‌నంగా మ‌హిళా దినోత్స‌వం

తాడేప‌ల్లి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని కోట్లాదిమంది మహిళలు హారతి పడుతూ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌కి బిగ్ థాంక్స్ చెబుతున్నామని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌ శ్రీమతి వాసిరెడ్డి పద్మ అన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి శ్రీమతి వాసిరెడ్డి పద్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ పోతుల సునీత కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా శ్రీమతి వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. తండ్రి, బిడ్డలు , కుటుంబంలో ఎవరు మహిళలకు ఇవ్వని గుర్తింపు సమానత్వం సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఇచ్చార‌న్నారు. మహిళల పేరిట ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్లు నిర్మిస్తున్నార‌ని, ఇలా ప్రతి పథకంలోనూ మహిళలకు ఇచ్చిన ప్రాధాన్య‌త‌తో మహిళలకు గుర్తింపు, సమానత్వం వచ్చిందన్నారు.

వై నాట్ 175 అనే సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నినాదాన్ని అమలు చేసి చూపించే శ‌క్తి ఈ రాష్ట్రంలోని మహిళలకు సాధ్యమన్నారు. ప్రతి మహిళా తన అరచేతిలో ఫోన్ ద్వారా రక్షణ పొందేలా దిశా యాప్ పనిచేస్తుందన్నారు. సీఎం వైయ‌స్‌ జగన్ తీసుకొచ్చిన దిశ యాప్ మహిళల కు రక్షణ, ధైర్యాన్ని ఇస్తుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళకు 50 శాతం రిజర్వేషన్ అసెంబ్లీలో చట్టం చేసిన ఘనత వైయ‌స్ఆర్ సీపీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఎన్నికల్లో వైయ‌స్‌ జగన్ ప్రభుత్వానికి మద్దతుగా ప్రచారం చేయడానికి మహిళా కమిషన్ చైర్‌ప‌ర్స‌న్ పదవికి రాజీనామా చేసినట్లు వాసిరెడ్డి ప‌ద్మ తెలిపారు. పార్టీ కోసం ఎన్నికల్లో పనిచేయడానికి తాను సిద్ధ‌మ‌ని చెప్పారు. 

ఈ కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు పోతుల సునీత, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, ఉపాధ్యక్షులు, జోనల్ కమిటీ చైర్మన్లు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అమ్మాజీ, ఏపీఐసీ చైర్మన్ బండి పుణ్యశీల, మహిళా అడ్వకేట్ లు తదితరులు పాల్గొన్నారు.

Best Web Hosting Provider In India 2024