Best Web Hosting Provider In India 2024
Kalki 2898 AD Bhairava: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఏడీ టీమ్ నుంచి రోజుకో సర్‌ప్రైజ్ వస్తోంది. గురువారం (మార్చి 7) ఈ టీమ్ ఇటలీ వెళ్లగా.. అక్కడి ఫొటోలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఇక మహా శివరాత్రి సందర్భంగా శుక్రవారం (మార్చి 8) మేకర్స్ ఈ మూవీలో ప్రభాస్ పాత్ర పేరును రివీల్ చేశారు. ఇందులో ప్రభాస్ పాత్ర పేరు భైరవ కావడం విశేషం.
ట్రెండింగ్ వార్తలు
భైరవుడు వచ్చేశాడు
ప్రభాస్ పాత్ర పేరును వెల్లడిస్తూ సరికొత్త పోస్టర్ ను కూడా మూవీ టీమ్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో ప్రభాస్ అదిరిపోయే లుక్ లో ఆకట్టుకున్నాడు. అతని బైసెప్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ప్రభాస్ వేసుకున్న కాస్టూమ్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. “కాశీ భవిష్యత్తు వీధుల్లో నుంచి కల్కి 2898 ఏడీ భైరవను పరిచయం చేస్తున్నాం” అనే క్యాప్షన్ తో మేకర్స్ ఈ పోస్టర్ రిలీజ్ చేశారు.
నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ మే 9న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. రిలీజ్ కు ఇంకా రెండు నెలల సమయం మాత్రమే ఉండటంతో మేకర్స్ ఉరుకులు పరుగుల మీద మిగిలిపోయిన షూటింగ్ పూర్తి చేస్తున్నారు. అదే సమయంలో ప్రమోషన్లపైనా దృష్టిసారించారు. మూడేళ్లుగా సాగుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ సినిమాలో ప్రభాస్ తోపాటు దీపికా పదుకోన్, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్లు కూడా నటిస్తున్నారు. కల్కి 2898 ఏడీ మూవీని సుమారు రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ తెరకెక్కిస్తుండగా.. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నాడు.
ఇటలీలో కల్కి 2898 ఏడీ టీమ్
తాజాగా కల్కి చిత్ర యూనిట్ సాంగ్ షూటింగ్ కోసం ఇటలీ వెళ్లింది. ప్రభాస్, నాగ్ అశ్విన్, దిశా పటానీతో పాటు యూనిట్ అంతా కలసి దిగిన ఫోటోని ఈ సందర్భంగా మేకర్స్ షేర్ చేశారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే, ఇటలీలోని అద్భుతమైన లోకేషన్స్‌లో ఆ పాటని చాలా గ్రాండ్‌గా చిత్రీకరించనున్నారు. కాగా ఈ పాటలో ప్రభాస్, దిశా పటానీ మధ్య రొమాన్స్ ఉండనుందని సమాచారం.
ఇదిలా ఉంటే తాజాగా తన షూట్ ముగించుకుని వచ్చినట్లుగా బాలీవుడ్ హాట్ బ్యూటి దిశా పటానీ సోషల్ మీడియాలో ఫొటో పోస్ట్ చేసింది. ఇక కల్కి మూవీ టీమ్ షేర్ చేసిన ఫొటోలో ప్రభాస్, దిశా పటానీతోపాటు నాగ్ అశ్విన్ ఇతర టెక్నీషియన్స్ ఉన్నారు. ఇదిలా ఉంటే, కల్కి 2898 AD సినిమా గ్లింప్స్ గత సంవత్సరం శాన్ డియాగో కామిక్-కాన్‌లో సంచలనం సృష్టించింది. టీజర్ గ్లింప్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలను అందుకుంది.
కల్కి 2898 ఏడీ చిత్రం అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనుందని ఇదివరకు విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ చూస్తే అర్థమవుతోంది.
టాపిక్