Parrot Fever Causes: ప్యారెట్ ఫీవర్‌కు బలవుతున్న ప్రాణాలు, ఈ జ్వరం ఎలా వస్తుంది? లక్షణాలు ఎలా ఉంటాయి?

Best Web Hosting Provider In India 2024

Parrot Fever: ప్యారెట్ ఫీవర్… ఇదొక శ్వాసకోశ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్. దీన్ని సైటాకోసిస్ అని కూడా పిలుస్తారు. ఐరోపా అంతటా ఈ జ్వరం వ్యాపిస్తోంది. ఇప్పటికే ఐదుగురిని చంపింది. క్లామిడోఫిలా సైటాసి (సి. సైటాసి) అనే బ్యాక్టిరియా వల్ల ఇది కలుగుతుంది. పక్షుల ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది. పక్షుల ఈకలు, మలం నుండి ఇది గాలిలో కలిపి మానవులకు వ్యాపిస్తుంది. ఈ వ్యాధి కారణంగా డెన్మార్క్ లో నలుగురు, నెదర్లాండ్స్ లో ఒకరు మరణించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చెబుతున్న ప్రకారం, ఆస్ట్రియా, జర్మనీ, స్వీడన్ దేశాల్లో ఈ జ్వరం వల్ల ఎంతో మంది ఆసుపత్రి పాలవుతున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు

పారెట్ ఫీవర్ సోకిన వారికి దగ్గు విపరీతంగా వేధిస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఛాతీ నొప్పి కూడా వస్తుంది. కొందరిలో నిమోనియా లక్షణాలు కనిపిస్తాయి. జ్వరం, కండరాల నొప్పి, తలనొప్పి, గ్యాస్ట్రిక్ లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఈ పారెట్ ఫీవర్‌కు కారణమయ్యే బ్యాక్టీరియా అధికంగా పక్షుల ద్వారానే మనుషులకు సోకుతుంది. కానీ మనుషుల నుంచి మనుషులకు వ్యాప్తి కావడం మాత్రం చాలా అరుదనే చెప్పాలి. ఈ ఇన్ఫెక్షన్ ప్రధానంగా చిలుకలు, పావురాలు, కోళ్లను ప్రభావితం చేస్తుంది. వాటి ద్వారా గాలి కలుషితం అవుతుంది. ఆ కలుషిత గాలిని పీల్చడం ద్వారా మనుషులు ఈ జ్వరం బారిన పడుతున్నారు.

పారెట్ ఫీవర్ లక్షణాలు

వ్యక్తులను బట్టి పారెట్ జ్వరం లక్షణాలు మారుతాయి. జ్వరం, తలనొప్పి, చలి, కండరాల నొప్పులు, దగ్గు, విరేచనాలు వంటి లక్షణాలు ఎక్కువమందిలో కనిపిస్తాయి. ఈ జ్వరంగా తీవ్రంగా మారుతుంది. అప్పుడు మయోకార్డిటిస్ లేదా గుండె కండరాల వాపు వంటి సమస్యలు వస్తాయి. కొంతమందిలో వికారం, వాంతులు, విరేచనాలు, పొట్ట నొప్పి… వంటి జీర్ణశయాంతర లక్షణాలు కనిపిస్తాయి.

 

పారెట్ ఫీవర్ చికిత్స

యాంటీబయాటిక్స్: పారెట్ ఫీవర్ వచ్చిన రోగులకు చికిత్సలో సాధారణంగా డాక్సీసైక్లిన్ లేదా టెట్రాసైక్లిన్ వంటి యాంటీబయాటిక్స్ ఇస్తారు. ఇవి క్లామిడియా సైటాసి బ్యాక్టిరియాపై ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఈ యాంటీబయాటిక్స్‌ను రెండు నుండి మూడు వారాల పాటు వినియోగించాల్సి ఉంటుంది. మందులు వాడడంతో పాటూ తగినంత విశ్రాంతి, పోషకాహారం, ఎక్కువ నీరు తాగడం ద్వారా రోగనిరోధక వ్యవస్థకు బలం వస్తుంది. పక్షులను ముట్టుకున్నాక చేతులను శుభ్రం చేసుకోవాలి. పక్షి ఈకలు, వాటి విసర్జనల ధూళిని పీల్చకుండా జాగ్రత్త పడాలి.

పారెట్ ఫీవర్ తీవ్రతను బట్టి వైద్యులు మందులను సూచిస్తారు. క్లామిడియా సిట్టాసి బ్యాక్టీరియాను శరీరం నుంచి తొలగించే మందులను వైద్యులు అందిస్తారు. మందులకు రోగి ప్రతిస్పందనను బట్టి, యాంటీబయాటిక్ థెరపీ కొనసాగిస్తారు.

పౌల్ట్రీ ఫారాల్లో పనిచేస్తున్న వారు జాగ్రత్తగా ఉండాలి. వారు త్వరగా ఈ ఫీవర్ బారిన పడే అవకాశం ఉండాలి. వారు తరచుగా చేతులు కడుక్కోవడం, అనారోగ్యంతో ఉన్న పక్షులకు దూరంగా ఉండాలి. పక్షులను చూసేటప్పుడు గ్లవ్స్, మాస్కులు ధరించడం వంటివి చేయాలి.

WhatsApp channel
 

టాపిక్

 

Source / Credits

Best Web Hosting Provider In India 2024