Best Web Hosting Provider In India 2024

తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ పదకొండవ జాబితా విడుదల అయ్యింది. రెండు పార్లమెంటు, ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్‌ఛార్జిలను ప్రకటిస్తూ శుక్రవారం సాయంత్రం అధిష్టానం ఒక ప్రకటన విడుదల చేసింది.
కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం సమన్వయకర్తగా బీవై రామయ్య, అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం సమన్వయకర్తగా రాపాక వరప్రసాద్‌ను నియమించింది. అలాగే.. రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా ఇటీవలె పార్టీలో చేరిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు ఛాన్స్ ఇచ్చింది.
రీజనల్ కో-ఆర్డినేటర్‌గా పెద్దిరెడ్డి
వైయస్ఆర్‌సీపీ అధినేత, సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అనంతపురం, హిందుపురం, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్‌గా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేసింది.