YSRCP Nandigama :
ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.15-12-2022(గురువారం) ..
కస్తాల మరియమ్మ గారి జ్ఞాపకార్థం గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు , ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
ముఖ్య అతిథిగా హాజరైన వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి సోదరి వైయస్ విమలమ్మ గారు ..
నియోజకవర్గంలోని దైవ సేవకులకు నూతన వస్త్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ,ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
నందిగామ పట్టణంలో ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారి సొంత నిధులతో నిర్మించనున్న క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ భవనానికి శంకుస్థాపన చేసిన వైఎస్ విమలమ్మ గారు ..
లోక రక్షకుడైన యేసు మానవాళి పాపాలు తొలగించేందుకు భూమి పైకి వచ్చి సమస్త ప్రాణులపై అంతులేని ప్రేమను చూపిన కరుణామయుడు ప్రభు యేసు : వైఎస్ విమలమ్మ గారు ..
మంచి చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాం .. ప్రజలకు మంచి చేస్తున్నాం .. మేము చేసే ప్రతి మంచి పనుల్లో ప్రభు యేసు క్రీస్తు ఆశీర్వాదం ఉంది : ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదలు కూడా అందరితో సమానంగా బ్రతకాలనే ఉద్దేశంతోనే ఉచితంగా నాణ్యమైన విద్య – మెరుగైన వైద్యం – సొంత ఇల్లు – సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు : ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
ప్రభు యేసు చెప్పినట్టు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే వాక్యాన్ని అనుసరిస్తూ ప్రజలను అమితంగా ప్రేమించే వ్యక్తి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి : ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
మా అమ్మ కస్తాల మరియమ్మ ప్రభు యేసును ఆరాధిస్తూ – ఆయన చూపిన మార్గంలో తోటి వారికి సహాయపడుతూ – ఆమె బిడ్డలైన మాకు కూడా సాటి వారికి తోడుగా నిలవాలి అని ఎప్పుడు చెబుతుండేది .. యేసయ్య ప్రార్థనలను – వాక్యాలను – పరిచర్య చేసే దైవ సేవకులను అమితంగా ఇష్టపడే మా అమ్మగారు స్ఫూర్తితో ప్రతి ఏటా దైవ సేవకుల సెమీ క్రిస్మస్ ఏర్పాటు చేసి నూతన వస్త్రాలను పంపిణీ చేస్తున్నాం : ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
ఈ కార్యక్రమంలో ప్రసంగికులు మొండితోక శాంత కుమారి ,సుధా , మట్టా రమేష్ ,దైవ సేవకులు జార్జి ముల్లర్ ,పాల్ శివశంకర్ రెడ్డి , హనోకు , జీడిఎంఎం ప్రసాద్ ,తదితరులు పాల్గొన్నారు ..