Best Web Hosting Provider In India 2024
Theppa Samudram Allari Naresh: శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై బిగ్ బాస్ తెలుగు 7 ఫేమ్ అర్జున్ అంబటి, 30 వెడ్స్ 21 సిరీస్ నటుడు చైతన్య రావు హీరోలుగా నటించిన లేటెస్ట్ మూవీ తెప్ప సముద్రం. ఈ సినిమాకు కొరమీను ఫేమ్ కిశోరి దాత్రక్ హీరోయిన్‌గా చేసింది. అలాగే తెప్ప సముద్రం సినిమాలో రవి శంకర్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ మూవీకి సతీష్ రాపోలు దర్శకత్వం, కథ, స్క్రీన్ ప్లే వహించారు. నీరుకంటి మంజుల రాఘవేందర్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ట్రెండింగ్ వార్తలు
పి. ఆర్ మ్యూజిక్ అందించిన తెప్ప సముద్రం సినిమా టీజర్‌ను మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8న రిలీజ్ చేశారు. ఈ టీజర్‌ను కామెడీ హీరో అల్లరి నరేష్ విడుదల చేశారు. తెప్ప సముద్రం టీజర్‌లో అమ్మాయిల మర్డర్ మిస్టరీ వెనుక దాగున్న రాక్షసుడు ఎవరు అనే కోణంలో సాగింది. తెప్ప సముద్రం సినిమాను ఒక మిస్టరీగా ఆద్యంతం థ్రిల్లింగ్ పంచేలా మన ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. 2015 లో తెలంగాణాలోని హాజీపూర్‌లో సంచలనం సృష్టించిన బావిలో స్కూల్ పిల్లల హత్యలు సంఘటన గుర్తుకు తెచ్చేలా ఉంది.
అయితే, సినిమాపై మరి కొంత క్లారిటీ రావాలంటే ట్రైలర్ రిలీజ్ దాకా వెయిట్ చేయాల్సిందే. ఇక తెప్ప సముద్రం టీజర్ గురించి అల్లరి నరేష్ కామెంట్స్ చేశారు. “తెప్ప సముద్రం టీజర్ చూడగానే ఒక మంచి థ్రిల్ ఫీల్ వచ్చింది. కచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను” అని అల్లరి నరేష్ తెలిపారు. నిర్మాత నీరుకంటి మంజుల రాఘవేందర్ గౌడ్ మాట్లాడుతూ “నేను ఎంతగానో అభిమానించే నటుడు అల్లరి నరేష్ గారి చేతుల మీదుగా తెప్ప సముద్రం టీజర్ రిలీజ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది” అని అన్నారు.
“నరేష్ అన్న అడగ్గానే మా చిత్రం టీజర్ రిలీజ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. తెప్ప సముద్రం మంచి థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో మీ ముందుకు వస్తున్నాం. ఈ సినిమాని పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నాం” అని బిగ్ బాస్ ఫేమ్, హీరో అంబటి అర్జున్ తెలిపాడు. దర్శకుడు సతీష్ రాపోలు మాట్లాడుతూ “మా సినిమా టీజర్ అల్లరి నరేష్ గారి చేతుల మీదుగా రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఏప్రిల్ 12న విడుదల కానుంది” అని పేర్కొన్నారు.
ఇక తెప్ప సముద్రం సినిమా నుంచి ఇటీవల విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. పాటలను ప్రముఖ సింగర్ మంగ్లీ, పెంచల్ దాస్, హేమచంద్ర ఆలపించారు. పీ ఆర్ సంగీతం అందిస్తున్న తెప్ప సముద్రం సినిమాకు శేఖర్ పోచంపల్లి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ పని చేస్తున్నారు. కాగా మర్డర్ మిస్టరీ నేపథ్యంలో వస్తున్న తెప్ప సముద్రం సినిమా ఏప్రిల్ 12న రిలీజ్ కానుంది. ఇందులో చైతన్య రావు పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది.