Indira Kranthi Scheme : మహిళలకు వడ్డీ లేని రుణాలు, రైతు బంధుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన

Best Web Hosting Provider In India 2024

Indira Kranthi Scheme : తెలంగాణ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇందిరా క్రాంతి పథకం ద్వారా మహిళలకు వడ్డీలేని రుణాలు అందించాలని నిర్ణయించింది. ఇందిరా క్రాంతి పథకాన్ని(Indira Kranthi Scheme) ఈ నెల 12న ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ పథకం ద్వారా సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి మహిళలకు వడ్డీ లేకుండా రుణాలు(zero interest loans) అందిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి మహిళను మహాలక్ష్మిగా భావించి గౌరవిస్తుందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు.

 

ట్రెండింగ్ వార్తలు

రైతు బంధుపై కీలక ప్రకటన

రైతు బంధుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ రైతు బంధు డబ్బులను(Rythu Bandhu Scheme) ఐదు నెలలపాటు రైతుల ఖాతాల్లో వేసిందన్నారు. కానీ కాంగ్రెస్ సర్కార్ వారి కంటే తక్కువ సమయంలోనే రైతు బంధు సాయాన్ని అందజేస్తున్నామన్నారు. కొండలు, గుట్టలు, రోడ్లకు రైతు బంధు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నామన్నారు. ప్రస్తుతం పాత డేటా ప్రకారమే రైతు బంధు ఇస్తున్నామన్నారు. ప్రస్తుతం 4 ఎకరాల లోపు ఉన్న వారికి రైతు బంధు ఇస్తున్నామన్నారు. త్వరలో 5 ఎకరాల లోపు ఉన్న వారికి రైతు బంధు ఇస్తామన్నారు. వ్యవసాయం చేసే వారికే రైతుబంధు ఇస్తామని పేర్కొ్న్నారు. రాష్ట్రంలో వ్యవసాయ పంపులకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదన్నారు.గత ప్రభుత్వంలో ఉద్యోగులకు ఎప్పుడూ మొదటి వారంలో జీతాలు అందలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగులందరికీ మార్చి 1నే జీతాలు ఇచ్చామన్నారు.

విద్యుత్ ఛార్జీలు పెంచబోం

కాళేశ్వరం, విద్యుత్ ప్రాజెక్టులను నిరర్థక ఆస్తులుగా వదిలేయమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గృహజ్యోతిపై (Gruhalakshmi)తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీలు (Electricity Charges)పెంచబోమని ప్రకటించారు. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ విద్యుత్ వినియోగం జరుగుతుందన్నారు. మరింత విద్యుత్ వినియోగం పెరిగినా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఏప్రిల్, మే నెలల్లో 16 వేల మెగావాట్ల విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు చేశామన్నారు. త్వరలో విద్యుత్ పాలసీని తీసుకువస్తామని వెల్లడించారు. వేసవిలో విద్యుత్ కొరత లేకుండా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామన్నారు. విద్యుత్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రణాళికతో ముందుకు వెళ్తామన్నారు. దీంతో పాటు సోలార్ విద్యుత్‌(Solar Power) వినియోగంపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 40,33,702 జీరో బిల్లులు(Zero Bills) ఇచ్చామని భట్టి విక్రమార్క తెలిపారు.

 

 

 
WhatsApp channel
 

సంబంధిత కథనం

టాపిక్

 
 
Mallu Bhatti VikramarkaTelangana NewsTrending TelanganaTelangana CongressTelugu NewsHyderabad

Source / Credits

Best Web Hosting Provider In India 2024