CM Revanth Reddy : త్వరలోనే వైబ్రంట్ తెలంగాణ 2050 మాస్టర్ ప్లాన్-అర్బన్, సబర్బన్, రూరల్ విభాగాలుగా అభివృద్ధి : సీఎం రేవం

Best Web Hosting Provider In India 2024

CM Revanth Reddy : రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం త్వరలోనే వైబ్రంట్‌ తెలంగాణ-2050(Vibrant Telangana 2050) మెగా మాస్టర్‌ ప్లాన్‌ ప్రకటించబోతున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలిపారు. మొత్తం తెలంగాణను మూడు విభాగాలుగా సమాన అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. ఎల్బీనగర్ బైరామల్‌గూడ చౌరస్తాలో కొత్తగా నిర్మించిన రెండో ఫ్లైఓవర్‌ను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… వైబ్రంట్‌ తెలంగాణపై కీలక అంశాలను ప్రస్తావించారు.

 

ట్రెండింగ్ వార్తలు

మూడు విభాగాలుగా అభివృద్ధి

ఔటర్‌ రింగ్‌(ORR) రోడ్డు లోపల ఉన్న మున్సిపాలిటీలు, పంచాయతీలన్నింటినీ ఒకే గొడుకు కిందకు తెచ్చి అర్బన్‌ తెలంగాణ(Urban Telangana)గా, 354 కి.మీ మేరకు ఓఆర్‌ఆర్‌ నుంచి ప్రతిపాదిత రీజినల్‌ రింగ్‌ రోడ్డు ప్రాంతాన్ని సబర్బన్ తెలంగాణ(Suburban Telangana)గా, అక్కడి నుంచి తెలంగాణ సరిహద్దు ప్రాంతం వరకు రూరల్‌ తెలంగాణ(Rural Telangana)గా రాష్ట్రాన్ని మొత్తం మూడు విభాగాలుగా సమగ్రాభివృద్ధి ప్రణాళికలు రూపొందించబోతున్నట్టు చెప్పారు. వైబ్రంట్‌ తెలంగాణ 2050 మెగా మాస్టర్ ప్లాన్‌ కోసం అంతర్జాతీయ కన్సల్టెన్సీని నియమించిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ ప్రణాళిక వచ్చిన తర్వాత ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేసి ఆ మాస్టర్ ప్లాన్‌ను విడుదల చేస్తామన్నారు.

మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి

హైదరాబాద్ నగరం చుట్టూ అన్ని ప్రాంతాల్లో సమానమైన అభివృద్ధి సాధించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మూసీ రివర్‌ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌(Musi River Front Development) కింద అంతర్జాతీయ ప్రమాణాలతో మూసీని అభివృద్ధి చేస్తామన్నారు. నగరం నలుమూలల్లో అభివృద్ధి సాధించాలన్న ఉద్దేశంతోనే మెట్రో మార్గాన్ని విస్తరించే ప్రణాళికలు రూపొందించామన్నారు. ఉప్పల్‌ నుంచి నాగోల్‌, ఎల్బీనగర్‌, చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి మీదుగా విమానాశ్రయం వరకు, బీహెచ్‌ఈఎల్‌ నుంచి రామచంద్రాపురం వరకు, గచ్చీబౌలీ నుంచి అమెరికన్ కాన్సులేట్‌ వరకు మెట్రో విస్తరించబోతున్నామని ప్రకటించారు.

 

25 ఏళ్ల అభివృద్ధికి ప్రణాళికలు

మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌లో భాగంగా మూసీ నది ప్రక్షాళన చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం పలు సీవేజీ ప్లాంటులను ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్ నలువైపులా ఇవాళ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. శనివారం ఉప్పల్‌ నల్లచెరువు సీవేజీ ట్రీట్‌మెంట్‌ ప్లాంటును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే 25 ఏళ్లలో హైదరాబాద్‌ నగరాన్ని అభివృద్ధి చేయడానికి ‍ప్రణాళికలు సిద్ధమవుతున్నట్టు చెప్పారు. హైదరాబాద్‌ను(Hyderabad) అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ హయాంలోనే ముందడుగు పడిందని, నగర సమస్యలను వేగంగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధికి కీలకమైన చెరువులు, ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసే వారి విషయంలో ఎవరినీ ఉపేక్షించలేది లేదన్నారు. కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులను ఆదేశించిన విషయాన్ని గుర్తుచేశారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి కొందరు అడ్డుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నారని, అలాంటి వారికి నగర బహిష్కరణ తప్పదని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

 
WhatsApp channel
 

సంబంధిత కథనం

టాపిక్

 
 
HyderabadCm Revanth ReddyTelangana NewsTrending TelanganaHyderabad MetroTelugu News

Source / Credits

Best Web Hosting Provider In India 2024