DSC Free Coaching : డీఎస్సీ అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్, ఇలా దరఖాస్తు చేసుకోండి!

Best Web Hosting Provider In India 2024

DSC Free Coaching : తెలంగాణ ప్రభుత్వం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఇటీవల మెగా డీఎస్సీ నోటిఫికేషన్(TS DSC Notification) విడుదల చేసిన సంగతి తెలిసిందే. డీఎస్సీ దరఖాస్తు (DSC Applications)చేసుకున్న అభ్యర్థులకు ఓ గుడ్ న్యూస్. డీఎస్సీ అప్లై చేసుకున్న ఎస్సీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్(DSC Free Coaching) ఇవ్వనున్నట్లు హైదరాబాద్ లోని రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్ శనివారం ప్రకటించింది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు రెండు నెలల పాటు ఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తామని పేర్కొంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 12 నుంచి 26వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది.

 

ట్రెండింగ్ వార్తలు

16 కేంద్రాల్లో ఫ్రీ కోచింగ్

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు… ప్రభుత్వ డైట్‌, బీఎడ్‌ (B.Ed)కాలేజీలతో పాటు ఇతర కాలేజీలతో కలిపి మొత్తం 16 కేంద్రాలలో ఫ్రీ డీఎస్సీ కోచింగ్ ఇస్తామని ఎస్సీ స్టడీ సర్కిల్(TS SC Study Circle) తెలిపింది. ప్రతి కేంద్రంలో 100 మందికి చొప్పున ఉచిత కోచింగ్‌ అందించనున్నారు. అయితే అభ్యర్థులు డైట్ లేదా టెట్‌ (TS TET)లో పాస్ అయ్యి ఉండాలి. దరఖాస్తు విధానం, ఇతర పూర్తి వివరాలు మార్చి 11వ తేదీ నుంచి అధికారిక వెబ్ సైట్ http://tsstudycircle.co.in/index.html లో అందుబాటులో ఉంటాయని ఎస్సీ స్టడీ సర్కిల్ ఓ ప్రకటనలో తెలిపింది.

 

 
WhatsApp channel
 

సంబంధిత కథనం

టాపిక్

 
 
Ts Dsc JobsTs Dsc Notification 2023Ts TetFree CoachingTelangana NewsTrending TelanganaHyderabad

Source / Credits

Best Web Hosting Provider In India 2024