Sophia Leone Died: అనుమానస్పద స్థితిలో పోర్న్ స్టార్ సోఫియా లియోన్ మృతి.. 3 నెలల్లో నాలుగో మరణం

Best Web Hosting Provider In India 2024

Adult Star Sophia Leone Death: అడల్ట్ ఫిల్మ్ స్టార్ సోఫియా లియోన్ పదిరోజుల క్రితం తన అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించింది. 26 ఏళ్ల సోఫియా లియోన్‌ను సంప్రదించేందుకు ఆమె కుటుంబ సభ్యులు కాల్ చేసిన ఆమె లిఫ్ట్ చేయలేదు. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం సోఫియా లియోన్ మరణించినట్లు ఆమె స్టెప్ ఫాదర్ (సవతి తండ్రి) మైక్ రొమెరో గో ఫౌండ్ మి ద్వారా అధికారికంగా ప్రకటించారు.

 

ట్రెండింగ్ వార్తలు

ప్రస్తుతం సోఫియా లియోన్ మృతిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే, సోఫియా మరణం ఆన్‌లైన్ పెద్ద చర్చకు దారి తీసింది. ఎందుకంటే గత కొన్ని నెలలుగా పోర్న్ స్టార్స్ ఆకస్మికంగా చనిపోతున్నట్లు వార్తలు రావడంతో సోఫియా లియోన్ మరణం కూడా వైరల్ అవుతోంది. 26 ఏళ్ల వయసులో అడల్ట్ ఫిల్మ్ స్టార్ సోఫియా లియోన్ కన్నుమూయడంపై పోర్న్ ఇండస్ట్రీకి చెందినవారు సంతాపం తెలియజేస్తున్నారు.

ఇదిలా ఉంటే మయామికి చెందిన సోఫియా తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో గత వారం చాలా యాక్టివ్‌గా కనిపించింది. సోషల్ మీడియాలో ఆమె కొన్ని పోస్ట్‌లను సైతం అప్‌లోడ్ చేసింది. ఫిబ్రవరి 5న మరో పోర్న్ స్టార్ ఎమిలీ విల్లీస్ (Emily Willis) ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ప్రాణాలకు పోరాడుతున్నట్లు సోఫియా పోస్ట్ ద్వారా వెల్లడించింది. ఈ పోస్ట్ చేసిన రెండు రోజుల తర్వాత సోఫియా లియోన్ మరణించినట్లు వార్తలు వచ్చాయి.

సోఫియా లియోన్ మరణంతో ఆమె కుటుంబం దిగ్భ్రాంతికి గురైంది. “మా ప్రియమైన సోఫియా మరణించందన్న వార్తను ఆమె తల్లి, కుటుంబ సభ్యుల తరఫున నేను చెప్పటానికి చాలా బాధగా ఉంది. సోఫియా ఆకస్మిక మరణం మమ్మల్ని తన స్నేహితులను చాలా దిగ్బ్రాంతికి గురి చేసింది” అని సోఫియా లియోన్ స్టెప్ ఫాదర్ మైక్ రొమెరో తెలిపారు. ఇంకా మైక్ కొనసాగిస్తూ “సోఫియా తన అపార్ట్‌మెంట్‌లో మార్చి 1, 2024న అనుమానస్పద స్థితిలో శవమై కనిపించినట్లు ఆమె కుటుంబం తెలిపింది. ఆమె మరణానికి గల కారణాలపై స్థానిక పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది” అని చెప్పారు.

 

“సోఫియా ఒక ప్రియమైన కుమార్తె, మంచి సోదరి, మనవరాలు, మేనకోడలు, స్నేహితురాలు. ఆమె ముఖ్యంగా యానిమల్ లవర్. ఆమె వద్ద ప్రత్యేకంగా 3 పెంపుడు జంతువులు ఉన్నాయి. వాటిని గాఢంగా ప్రేమించేది. బాగా చూసుకునేది. ఆమెకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. తన చుట్టు ఉన్నవారందరిని ఎప్పుడూ నవ్వించేది. ప్రతి ఒక్కరిని సంతోషపెట్టేందుకు మార్గాలు వెతికేది” అని సోఫియా తండ్రి తెలిపినట్లు హాలీవుడ్ వెబ్ సైట్ రాసుకొచ్చింది.

సోఫియా లియోన్ మృతి మూడు నెలల వ్యవధిలో నాలుగో పోర్న్ స్టార్ మరణం. ఇలా అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అకస్మాత్తుగా మరణాలు పెరగడాన్ని గమనించిన నెటిజన్లు ఆన్‌లైన్‌లో చర్చకు దారితీశారు. ఇంతకుముందు, 36 సంవత్సరాల కాగ్నీ లిన్ కార్టర్ (Kagney Linn Karter) సూసైడ్ చేసుకుని మరణించింది. ఆమె మరణంపై విచారణ జరుగుతోంది. కాగ్నీ లిన్ కంటే ముందు జనవరిలో ఓక్లహోమాలో తన ప్రియుడు బ్రెట్ హాసెన్‌ముల్లర్‌తో (Brett Hasenmueller) కలిసి అడల్ట్ స్టార్ జెస్సీ జేన్ (Jesse Jane) చనిపోయినట్లు గుర్తించారు.

“మొదటి కాగ్నీ లిన్ కార్టర్, ఇప్పుడు సోఫియా లియోన్. అతి త్వరలో ఎమిలీ విల్లిస్. నా పరిశోధన చరిత్ర నెమ్మదిగా స్మశానవాటికగా మారుతోంది” అని ఒక నెటిజన్ రాసుకొచ్చాడు. “మొదట ఎమిలీ విల్లిస్. ఇప్పుడు సోఫియా లియోన్. మీరు పోర్న్ పరిశ్రమ గురించి నిజం మాట్లాడితే నిన్ను కూడా చంపేస్తారు” ఆ నెటిజన్‌కు ఇతరులు మెసేజ్ చేశారు.

 

ఈ అడల్ట్ ఫిల్మ్ స్టార్స్ అందరూ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. కాగ్నీ లిన్ కార్టర్, జెస్సీ జేన్, బ్రెట్ హాసెన్‌ముల్లర్ సూసైడ్ చేసుకోగా.. 25 ఏళ్ల ఎమిలీ విల్లిస్ కొన్ని వారాల క్రితం ఓవర్ డోస్ తీసుకుంది. ఇప్పుడు ఆస్పత్రిలో క్రిటికల్ కండిషన్‌లో ఉంది.

WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024