Main Atal Hoon OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న మాజీ ప్రధాని బయోపిక్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Best Web Hosting Provider In India 2024

Main Atal Hoon OTT Streaming Date: భారత దేశ మాజీ ప్రధాని, దివంగత నేత అటల్ బిహారీ వాజ్‍పేయి జీవితం ఆధారంగా ‘మై అటల్ హూ’ హిందీ చిత్రం రూపొందింది. ఈ బయోపిక్ సినిమా జనవరి 19వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. మోస్తరు వసూళ్లను దక్కించుకుంది. ఈ చిత్రంలో వాజ్‍పేయీ పాత్ర పోషించారు ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వస్తోంది. మై అటల్ హూ సినిమా స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది.

ట్రెండింగ్ వార్తలు

స్ట్రీమింగ్ డేట్ ఇదే

మై అటల్ హూ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‍ను జీ5 ప్లాట్‍ఫామ్ వెల్లడించింది. మార్చి 14వ తేదీన ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు వెల్లడించింది. ఈ విషయంపై నేడు (మార్చి 10) అధికారిక ప్రకటన చేసింది జీ5 ఓటీటీ.

“అద్భుతమైన దార్శనికత, నిర్ణయాలతో దేశానికి కొత్త దిశను అటల్ బిహారీ నిర్దేశించారు. మై అటల్ హూ మార్చి 14న జీ5లో ప్రీమియర్ అవుతుంది” అని జీ5 ప్లాట్‍ఫామ్ ట్వీట్ చేసింది.

మాజీ ప్రధాన మంత్రి, రాజనీతిజ్ఞుడు, చాలా మంది ఇష్టపడే రాజకీయ నేత అయిన అటల్ బిహారీ వాజ్‍పేయి పాలనను, జీవితాన్ని మై అటల్ హూ చిత్రంలో మేకర్స్ చూపించారు. అలాగే, ఆయన వ్యక్తిగతంగా ఎదుర్కొన్న సవాళ్లు, కుటుంబం, స్నేహితులతో ఆయన బంధాలను కూడా తెరకెక్కించారు. అత్యున్నత రాజకీయ విలువలు చూపిన, దేశానికి నిస్వార్థ సేవ చేసిన వాజ్‍పేయీ ప్రస్థానాన్ని చూపించారు. పాకిస్థాన్‍తో కార్గిల్ యుద్ధం, పోఖ్రాన్ అణు పరీక్ష సహా చాలా అంశాలు ఉన్నాయి.

మై అటల్ హూ చిత్రంలో వాజ్‍పేయీ క్యారెక్టర్లో పంకజ్ త్రిపాఠి నటించగా.. పియూష్ మిశ్రా, రాజా రమేశ్‍కుమార్, దయాశంకర్ పాండే, ప్రమోద్ పాఠక్, పాయల్ నాయర్, రాజేశ్ ఖత్రి, ఎక్లాక్ ఖాన్, హర్షద్ కుమార్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి రవి జాదవ్ దర్శకత్వం వహించారు.

మై అటల్ హూ చిత్రాన్ని భానుశాలి స్టూడియోస్ లిమిటెడ్, లెజెండ్ స్టూడియోస్ పతాకాలపై వినోద్ భానుశాలి, సందీప్ సింగ్, కమరేశ్ భానుశాలి సంయుక్తంగా నిర్మించారు. పాయల్ దేవ్, కైలాశ్ ఖేర్, అమృత్ రాజ్, మొహంతీ శర్మ సంగీత దర్శకులుగా వ్యవహరించారు.

అటల్ బీహారీ వాజ్‍పేయి తన రాజకీయ ప్రస్థానంలో చాలా కీలక పదవులు చేపట్టారు. బీజేపీ అగ్రనేతగా వ్యవహరించారు. 1996లో స్వల్ప హయాం తర్వాత 1998 నుంచి 2004 వరకు దేశ ప్రధానిగా సేవలు అందించారు. దేశం గతిని మార్చేలా అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గొప్ప రాజకీయ విలువలు చూపిన వ్యక్తిగా, సౌమ్యుడిగా, రాజనీతిజ్ఞుడిగా, గొప్ప రచయితగా ఆయన నిలిచారు.

హనుమాన్‍పై సైలెంట్

బ్లాక్ బాస్టర్ సూపర్ హీరో మూవీ హనుమాన్ రిలీజ్ డేట్‍పై జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఇంకా అప్‍డేట్ ఇవ్వలేదు. మార్చి 8వ తేదీన ఈ చిత్రం జీ5లోకి రావడం ఖాయమని వెల్లడవగా.. అలా జరగలేదు. హనుమాన్‍ను స్ట్రీమింగ్‍కు తీసుకురాలేదు జీ5. త్వరలోనే జీ5 ఈ సినిమా గురించి ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటించిన హనుమాన్ భారీ వసూళ్లతో బంపర్ హిట్ అయింది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024