Ramdan Suhoor : రంజాన్ ఉపవాసంలో అధిక దాహాన్ని నివారించేందుకు సుహూర్ సమయంలో ఏం తీసుకోవాలి?

Best Web Hosting Provider In India 2024

Ramzan 2024 : ముస్లింలకు రంజాన్ మాసం చాలా పవిత్రమైనది. చాలా కఠినమైన ఉపవాసం చేస్తారు. ఉమ్మి కూడా మింగకుండా ఉంటారు. ఈ ఉపవాసం చాలా కఠినమైనది. వారు సూర్యోదయానికి ముందు ఉపవాసాన్ని విరమిస్తారు. సూర్యాస్తమయం సమయంలో ఉపవాసాన్ని విరమిస్తారు. ఈ ఉపవాస కాలంలో లాలాజలం మింగకుండా లేదా నీరు తాగకుండా కచ్చితంగా ఉపవాసం ఉంటారు. సుర్యుడు రావడం కంటే ముందుగా ఆహారం తింటారు. దీనిని సుహూర్ అంటారు.

ట్రెండింగ్ వార్తలు

ఈ వేసవిలో ఇంతటి కఠినమైన ఉపవాసం ఉండటం అంటే మాటలు కాదు. చాలా కష్టంతో కూడుకున్నది. కనీసం ఉమ్మి కూడా మింగరు. దీంతో అధిక వేడి వల్ల శరీరంలో నీరు తగ్గిపోయే అవకాశం ఉంది. పనికి వెళ్లే వారు ఉపవాసం విరమించే ముందు తినే సుహూర్ భోజనంలో కొన్ని ఆహారాలు తినాలి. ఉపవాస కాలంలో అధిక దాహాన్ని నివారించవచ్చు. ఆ ఆహారాలు ఏంటో చూద్దాం.

ఓట్స్‌ను పాలు లేదా నీటితో కలిపి తీసుకుంటే, అది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. అధిక దాహాన్ని నివారిస్తుంది. అలాగే ఓట్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మిమ్మల్ని ఎక్కువసేపు ఆకలిగా అనిపించకుండా చేస్తుంది. కడుపు నిండుగా ఉంచుతుంది. ఇలా తీసుకుంటే దాహం అనేది కాస్త తగ్గిపోతుంది.

పాలకూర మార్కెట్లో దొరుకుతుంది. ఈ పాలకూరలో 95 శాతం నీరు ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల శరీరం తగినంతగా హైడ్రేట్ అవుతుంది. అందుకోసం పాలకూరను ఫ్రైలుగా చేసుకుని తినవచ్చు. పాలకూర ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎక్కువసేపు శక్తి ఉంటుంది. ఇందులోని పోషకాలు మీరు త్వరగా అలసిపోకుండా చేస్తాయి.

అరటిపండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. దాహాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. పండని అరటిపండ్లకు దూరంగా ఉండాలి. ఎందుకంటే అవి ప్రతికూలంగా ఉంటాయి. అంటే శరీరం పొడిబారడం మరింత పెరుగుతుంది. బాగా పండిన అరటిపండు తినండి. మీరు శక్తితోపాటుగా దాహం వేయడం కాస్త తగ్గుతుంది.

ఒక గిన్నె పెరుగులో 85 శాతం నీరు ఉంటుంది. ఇందులో మంచి బ్యాక్టీరియా, కాల్షియం కూడా ఉన్నాయి. సుహూర్ సమయంలో పెరుగును తినేటప్పుడు, అది శరీరంలో తగినంత హైడ్రేషన్‌ను నిర్వహించడంలో సహాయపడుతుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

అవోకాడో చల్లగా ఉండటమే కాదు, ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, కరిగే విటమిన్లు, ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా ఈ పండులో 60-70 శాతం నీరు ఉంటుంది. మీ ఉపవాసం ప్రారంభించే ముందు అవకాడో మిల్క్ షేక్ తాగండి.

దోసకాయలో 96 శాతం నీరు ఉంటుంది. ఇది దాహాన్ని తీర్చగలదు. ఉపవాసం ఉన్నవారు దోసకాయ భోజన సమయంలో పెరుగుతో కలిపి తింటే దాహం తగ్గుతుంది. ఎక్కువసేపు హైడ్రేట్ గా ఉండవచ్చు.

పుచ్చకాయలో 92 శాతం నీరు ఎక్కువగా ఉంటుంది. ఉపవాసం ఉన్నవారు సుహూర్ సమయంలో పుచ్చకాయను తినడం మంచిది. ఇది రుచిగా ఉండటమే కాకుండా శరీరాన్ని హైడ్రేట్ గా, తాజాగా ఉంచుతుంది.

టొమాటో జ్యూస్‌లో సరైన మొత్తంలో సోడియం, వాటర్ కంటెంట్ ఉంటుంది. సుహూర్ సమయంలో తీసుకుంటే అది రోజంతా మిమ్మల్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. టొమాటోల్లో ప్రధానంగా లైకోపీన్ ఉంటుంది. ఇది పురుషులలో ప్రోస్టేట్ గ్రంథికి మంచిది.

WhatsApp channel
Source / Credits

Best Web Hosting Provider In India 2024