YSRCP Nandigama :

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ మండలం :
ది.16-12-2022(శుక్రవారం) ..
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
అన్నదాతల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కృషి ..
నందిగామ మండలంలోని అంబారుపేట గ్రామంలో పి.ఎ.సి.ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు శుక్రవారం ప్రారంభించారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి- అభివృద్ధికి కృషి చేస్తుందని ,అందులో భాగంగానే రైతుల పండించిన ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తూ ,నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు , రైతులకు మేలు చేసేందుకు ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసి వ్యవసాయానికి అవసరమైన పరికరాలు, విత్తనాలు ,పురుగుమందులు ,ఎరువులు , వ్యవసాయ సమాచారం అందిస్తుందని తెలిపారు ,ధాన్యం గ్రేడ్ -ఏ రకానికి క్వింటాకు మద్దతు ధర రూ.2060 /- అందజేస్తున్నట్లు తెలిపారు ..
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఐలపోగు రమ రాంబాబు , నాయకులు మహమ్మద్ మస్తాన్ , పాములపాటి రమేష్ ,గుడివాడ సాంబశివరావు, ఏవో ఖాసిం , పలువురు రైతులు పాల్గొన్నారు ..