YSRCP Nandigama :

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ మండలం :
ది.17-12-2022(శనివారం) ..
శ్రీ మేరమ్మ యాడి దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
అమ్మవారి ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తా : ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
నందిగామ మండలంలోని రాఘవాపురం గ్రామంలో నూతనంగా నిర్మించనున్న శ్రీ మేరమ్మ యాడి దేవాలయ నిర్మాణ పనులకు శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు శనివారం పూజా కార్యక్రమాలు నిర్వహించి ,శంకుస్థాపన చేశారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తండా ప్రజలు ఎంతగానో ఆరాధించే శ్రీ మేరమ్మ యాడి దేవాలయ నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానని , అదేవిధంగా దేవాదాయ శాఖ నుండి లేదా తిరుమల తిరుపతి దేవస్థానం నుండి గాని లేదా ఎమ్మెల్యే గారి నిధులనుండి అమ్మవారి ఆలయ నిర్మాణానికి ఆర్థిక సహకారం అందే విధంగా కృషి చేస్తానని తెలిపారు , అమ్మవారి ఆశీస్సులతో త్వరితగతిన ఆలయ నిర్మాణం జరుగుతుందని ఆకాంక్షించారు , అనంతరం శ్రీ మేరమ్మ యాడి దేవాలయ నిర్మాణ కమిటీ అధ్యక్షులు నునావత్ స్వామి నాయక్ ను ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు అభినందించారు ..
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెసరమల్లి సురేష్ , ఎంపీటీసీ పెసరమల్లి రమాదేవి ,నాయకులు పెసరమల్లి స్టాలిన్ , చంద్రశేఖర్ , మండల కన్వీనర్ శివ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ..