YSRCP Nandigama :

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.18-12-2022(ఆదివారం) ..
ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
కమ్మ సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయం : ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
నందిగామ పట్టణంలోని కమ్మ కళ్యాణ మండపంలో కమ్మ సంఘం ఆధ్వర్యంలో శంకర్ కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఏర్పాటుచేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ఆదివారం ప్రారంభించారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రజలకు ఉచిత ఆధునాతన కంటి చూపు పరీక్షలు, వైద్య సేవలు అందుబాటులోకి రావడం మంచి పరిణామమని ,ప్రజలు వైద్య శిబిరం సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు , నందిగామ కమ్మ సంఘం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని చెప్పారు ,కమ్మ సంఘం కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు ..
ఈ కార్యక్రమంలో వైసిపి పట్టణ అధ్యక్షులు దొంతి రెడ్డి దేవేందర్ రెడ్డి , కే డి సి సి డైరెక్టర్ కొమ్మినేని రవిశంకర్ , పీపీ రంగా, వాసుదేవరావు , కామసాని సత్యవతి , సత్యనారాయణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ..