YSRCP Nandigama : జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలను ప్రారంభించిన మంత్రి రోజా , జోగి రమేష్ , ఎమ్మెల్సీ గారు ..

YSRCP Nandigama :

 

 

ఎన్టీఆర్ జిల్లా / విజయవాడ :
ది.19-12-2022(సోమవారం) ..

జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలను ప్రారంభించిన మంత్రి రోజా , జోగి రమేష్ , ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..

కళాకారులకు అండగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం : ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..

విజయవాడ నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్రస్థాయి జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలను మంత్రి రోజా తో కలిసి జోగి రమేష్ , ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ..

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు మాట్లాడుతూ మన సంస్కృతి ,సాంప్రదాయాలు ,కళారూపాలు ,జానపదాలు, నాటక రూపాలు భావితరాలకు అందించడానికి సాంస్కృతిక కార్యక్రమాల పాత్ర కీలకమని తెలిపారు , కళాకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందనడానికి ఈ ఉత్సవాలే నిదర్శనమని పేర్కొన్నారు ,ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జోనల్ స్థాయిలో పలు నగరాల్లో సాంస్కృతిక పోటీలను నిర్వహించడం జరిగిందని ,జోనల్ స్థాయి విజేతలకు రాష్ట్ర స్థాయి పోటీలను తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రెండు రోజులపాటు నిర్వహించడం జరుగుతుందన్నారు , కళాకారులు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడుతున్న రాష్ట్రవ్యాప్తంగా కళలను ప్రదర్శిస్తూనే ఉంటారన్నారు , విద్యార్థులు చదువుతోపాటు సాంస్కృతిక ,క్రీడా రంగాల్లో ప్రతిభను చాటాలన్నారు , రాష్ట్రస్థాయి పోటీలలో ప్రతిభను కనబరిచిన కళాకారులకు ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించడమే కాకుండా జీవనోపాధికి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు , అనంతరం ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారిని సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా గారు ఘనంగా సత్కరించి -జ్ఞాపికను అందజేశారు ,

ఈ కార్యక్రమంలో విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి ,రాష్ట్ర సాంస్కృతిక శాఖ ప్రతినిధులు , పలువురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *