
*ఎన్టీఆర్ జిల్లా / వీరులపాడు మండలం
*ది.20-12-2022(మంగళవారం) ..*
*జుజ్జూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన భవనం మరియు గోడౌన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..*
*ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు , కేడీసీసీబీ చైర్మన్ ..*
*పెద్దాపురం గ్రామంలో కెడీసీసీబీ ఏటీఎం ను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు , కేడీసీసీబీ చైర్మన్ ..*
*కేడీసీసీబీ నుండి లబ్ధిదారులకు మంజూరైన రుణాల చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు , కే డి సి సి బి చైర్మన్ ..*
*రైతుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కృషి : కేడీసీసీబీ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు ..*
మండల పరిధిలోని జుజ్జూరు గ్రామ సొసైటీ ఆవరణలో కేడీసీసీబీ నిధులు రూ.25.30 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం భవన నిర్మాణ పనులకు , స్ట్రాంగ్ రూమ్ మరియు గోడౌన్ నిర్మాణ పనులకు శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు, కేడీసీసీబీ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు గారితో కలిసి శంకుస్థాపన నిర్వహించారు ..
అనంతరం పెద్దాపురం గ్రామంలో కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంక్ పెద్దాపురం బ్రాంచ్ ఆవరణలో రూ.8 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన ఏటీఎం ను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు, కేడీసీసీబీ చైర్మన్ తన్నీర్ నాగేశ్వరరావు గారితో కలిసి ప్రారంభించారు ..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అభివృద్ధికి కృషి చేస్తుందని అందులో భాగంగానే నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సొసైటీ భవనాల నిర్మాణం ,రైతు భరోసా కేంద్రాల నిర్మాణం , కేడీసీసీబీ ద్వారా రైతులకు పెద్ద ఎత్తున సబ్సిడీ రుణాలు , వ్యవసాయ రుణాలు మంజూరు చేస్తూ వారి అభివృద్ధికి కూడా తోడ్పాటు అందిస్తున్నట్లు తెలిపారు , గ్రామాల్లో రైతుల అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకొని కేడీసీసీబీ విస్తృతమైన సేవలు అందిస్తుందన్నారు ..
ఈ కార్యక్రమంలో ఎంపిపి కోటేరు లక్ష్మి ముత్తారెడ్డి , జడ్పిటిసి అమర్లపూడి కీర్తి సౌజన్య, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షహనాజ్ బేగం , సొసైటీ అధ్యక్షులు పూల రాంబాబు , మండల కన్వీనర్ ఆవుల రమేష్ బాబు , సర్పంచ్ రమావత్ కోటి , నిప్పుల పల్లి శాంతమ్మ ,ఉప సర్పంచ్ సాయిబాబా మరియు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..