YSRCP Nandigama :

ఎన్టీఆర్ జిల్లా / చందర్లపాడు :
ది.21-12-2022(బుధవారం) ..
చందర్లపాడు లో ఘనంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి వైఎస్ జగన్ కు శుభాకాంక్షలు తెలిపిన శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని 29 మంది రైతులకు – లబ్ధిదారులకు చందర్లపాడు విశాల సహకార పరపతి సంఘం ద్వారా రూ.1.49 కోట్ల రుణాల చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
రైతు పక్షపాతి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని తెలిపిన శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కస్తాల పున్నమ్మ , జడ్పిటిసి ముక్కపాటి నరసింహారావు , మండల కన్వీనర్ కందుల నాగేశ్వరరావు , మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ వెలగపూడి వెంకటేశ్వరరావు , నాయకులు యార్లగడ్డ సత్యనారాయణ ప్రసాద్ , సొసైటీ అధ్యక్షులు రాయల జానకి రామయ్య , జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు శాఖమూరి కృష్ణకుమారి , షేక్ లాల్ సా తదితరులు పాల్గొన్నారు ..