నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా ప్రైమరీ పాఠశాల మ్యాపింగ్ పై సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..


ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.27-7-2022(బుధవారం) ..

నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా ప్రైమరీ పాఠశాల మ్యాపింగ్ పై సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..

విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం ..

నందిగామ పట్టణం లోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో నూతన జాతీయ విద్యా విధానం మరియు ప్రైమరీ పాఠశాలల మ్యాపింగ్ పై శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు సమీక్ష నిర్వహించారు ,

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి వందల కోట్లు ఖర్చు పెట్టి నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చి – ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉచితంగా , ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నారన్నారు , అదేవిధంగా నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా ప్రభుత్వం ప్రైమరీ పాఠశాల మ్యాపింగ్ ప్రక్రియ జరుపుతుందని ,దీని ద్వారా విద్యార్థులకు ఎటువంటి నష్టము ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు , దీనిపై జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేసిందని -క్షేత్రస్థాయిలో విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఆయా పాఠశాలల ఉపాధ్యాయుల అభిప్రాయాలను సేకరించి ,దగ్గరలోని ప్రభుత్వ పాఠశాలలను మాత్రమే మ్యాపింగ్ చేస్తున్నారని – అదే విధంగా గ్రామాల్లో విద్యార్థుల ప్రయాణాలకు ఇబ్బందులు కలిగే విధంగా దూరంగా ఉన్న పాఠశాలలను గుర్తించి వాటిని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి మ్యాపింగ్ పై నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు , నియోజకవర్గంలో మ్యాపింగ్ ప్రక్రియలో విద్యార్థులకు ఇబ్బందులు కలిగే విధంగా ఉన్న పాఠశాలలను గుర్తించి తన దృష్టికి తీసుకు రావాలని ఆయా పాఠశాలల పై కలెక్టర్ తో మాట్లాడతానని ఎమ్మెల్యే డాక్టర్ జగన్ మోహన్ రావు తెలిపారు ,

ఈ కార్యక్రమంలో ఎం.ఈ.ఓ.లు – నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ,విద్యాధికారులు పాల్గొన్నారు ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *