YSRCP Nandigama : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మొక్కలు నాటిన ఎమ్మెల్సీ గారు ..

YSRCP Nandigama :

 

 

 

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది‌.21-12-2022(బుధవారం) ..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మొక్కలు నాటిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..

ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి – విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి : ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..

సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆనందోత్సవాలతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పాఠశాల విద్యార్థులు ..

మొక్కలు పెంచడం వల్ల ఆరోగ్యకరమైన జీవితం : ఎమ్మెల్సీ డాక్టర్ అరుణ్ కుమార్ గారు ‌.‌.

నందిగామ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు మొక్కలు నాటారు , అనంతరం పాఠశాల విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు పెంచడం వల్ల ఆరోగ్యకరమైన- ఆనందకరమైన జీవితం గడపవచ్చని ,మొక్కలు నాటడం వల్ల పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించడంతోపాటు స్వచ్ఛమైన ప్రాణవాయువు పొందవచ్చని చెప్పారు , మొక్కలు నాటకం వల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు అవగాహన కలిగించాలని ఉపాధ్యాయులకు సూచించారు ,

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టి , ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి కార్పొరేట్ పాఠశాలల కంటే ఉన్నతంగా తీర్చిదిద్దారని తెలిపారు ,విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ వారి చదువులకు తల్లిదండ్రుల కష్టాలు అడ్డంకి కాకుండా అమ్మ ఒడి ,గోరుముద్ద ,జగనన్న విద్యా దీవెన , వసతి దీవెన , ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి పథకాలను అమలు చేస్తున్నారని , కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులు ఉపయోగించే ట్యాబ్ లను కూడా ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందజేసే చర్యలు తీసుకున్నారన్నారు ,అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మామయ్యకు తమ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలపాలని విద్యార్థులు ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారికి హర్షద్వానాల మధ్య తెలియజేశారు ..

ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ డాక్టర్ జయరాం ,ఏఈ ఫణి శ్రీనివాస్ ,పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాంబాబు నాయక్ ,పట్టణ అధ్యక్షులు దొంతిరెడ్డి దేవేందర్ రెడ్డి , మహమ్మద్ మస్తాన్ ,మండవ పిచ్చయ్య, చల్లా బ్రహ్మం ,గుడివాడ సాంబశివరావు, పాకాలపాటి కిరణ్ , అమరయ్య ,రాము ,దుర్గారావు తదితరులు పాల్గొన్నారు ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *