YSRCP Nandigama : పట్టణంలో ట్రాఫిక్ సమస్యను నివారించేందుకే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు : ఎమ్మెల్యే గారు ..

YSRCP Nandigama :

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది‌.23-12-2022(శుక్రవారం) ..

నందిగామ పట్టణ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు, పోలీస్ కమిషనర్ క్రాంతి రానా టాటా ..

పట్టణంలో ట్రాఫిక్ సమస్యను నివారించేందుకే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు : ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..

ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటులో ఎమ్మెల్యే – ఎమ్మెల్సీల కృషి ప్రశంసనీయం : సిపి క్రాంతి రానా టాటా ..

ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను మంజూరు చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు : ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..

నందిగామ పట్టణంలో పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన నూతన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు , ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు లతో కలిసి విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతి రానా టాటా శుక్రవారం ప్రారంభించారు ..

ఈ సందర్భంగా సిపి క్రాంతి రానా టాటా మాట్లాడుతూ నందిగామ పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీవ్రమవడంతో, ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేకంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు ఆవశ్యకతను స్థానిక శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ లు సంయుక్తంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను మంజూరు చేయించారని తెలిపారు, ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్ కు సిబ్బందిని కూడా కేటాయించడం జరిగిందని చెప్పారు ‌..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ జగన్ మోహన్ రావు గారు మాట్లాడుతూ నందిగామ పట్టణంలో మరియు జాతీయ రహదారి పై ట్రాఫిక్ రద్దీ తీవ్రమవడంతో , పలు రోడ్డు ప్రమాదాలు జరిగి స్థానికులు మృత్యువాత పడిన ఘటనలు చోటు చేసుకోవడం జరిగిందన్నారు, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు పోలీస్ స్టేషన్ ఏర్పాటు పై పలుమార్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లటంతో సానుకూలంగా స్పందించిన ఆయన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను మంజూరు చేశారని తెలిపారు, విజయవాడ నగరం తర్వాత అత్యంత రద్దీ కలిగిన నందిగామ పట్టణంలో ట్రాఫిక్ తీవ్రమైందని దీనిని నివారించేందుకే నందిగామ పట్టణంలోని పలు జంక్షన్ లలో సిగ్నలింగ్ వ్యవస్థ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు , రద్దీ ప్రదేశాలలో ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసి ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు .. అడిగిన వెంటనే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు చొరవ చూపిన డిజిపి రాజేంద్ర నాథ్ రెడ్డి , సిపి క్రాంతి రానా టాటా లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు చెప్పారు ‌.. నందిగామ పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని , అందులో భాగంగానే రెవెన్యూ డివిజన్ ఏర్పాటు , కేంద్రీయ విద్యాలయం, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లాంటి వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నామన్నారు ..

ఈ కార్యక్రమంలో డీసీపీ మేరీ ప్రశాంతి , ఏసీబీ నాగేశ్వర్ రెడ్డి , సిఐలు సతీష్ ,నాగేంద్రబాబు , ఎస్సైలు , నగర పంచాయతీ కమిషనర్ డాక్టర్ జయరాం, నగర పంచాయతీ కౌన్సిల్ మరియు కో ఆప్షన్స్ సభ్యులు ,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *