YSRCP Nandigama : పట్టణంలోని సీఎం రోడ్డు(NTR ROAD)ను ప్రారంభించిన ఎమ్మెల్యే గారు ,ఎమ్మెల్సీ గారు ..

YSRCP Nandigama :

 

 

 

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.25-12-2022(ఆదివారం) ..

మంచి చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాం .. మంచే చేస్తాం : ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..

నందిగామ పట్టణంలోని సీఎం రోడ్డు(NTR ROAD) ను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు , ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..

నందిగామ పట్టణంలోని అన్ని ప్రధాన రహదాలను విస్తరిస్తాం .. నందిగామ పట్టణ అభివృద్ధే మా ధ్యేయం : ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..

నందిగామ పట్టణంలో 14 మరియు 15 ఆర్థిక సంఘం నిధులు రూ.1.38 కోట్లతో సీఎం రోడ్డులో చేపట్టిన కాలువల నిర్మాణం మరియు బీటీ రోడ్డు నిర్మాణం పూర్తి చేసుకుని ఎన్టీఆర్ రోడ్డుగా నామకరణం చేయబడిన సీఎం రోడ్డును శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు, ఎమ్మెల్సీ డాక్టర్ అరుణ్ కుమార్ గారితో కలిసి ఆదివారం ప్రారంభించారు ..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మేము పుట్టి ,పెరిగి ,చదువుకున్న నందిగామను అభివృద్ధి చేయాలని మా ఆకాంక్ష , మా నాయకుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన అవకాశంతో రాజకీయాల్లోకి వచ్చి నందిగామ ప్రజల ఆశీర్వాదంతో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యానని తెలిపారు , మా ఆలోచనలకు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే పరిపాలన చేస్తున్నామని , నందిగామను అన్ని రంగాల్లో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలనే తలంపుతోనే ముందుకు నడుస్తున్నామన్నారు , అందులో భాగంగానే రెవిన్యూ డివిజన్ ఏర్పాటు, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు , సీఎం రోడ్డు విస్తరణ ,గాంధీ జంక్షన్ ఐలాండ్ పనులు చేపట్టామని తెలిపారు, రానున్న రోజుల్లో నందిగామ పట్టణంలోని ప్రధాన రహదారులన్నిటిని విస్తరణ చేస్తామని , నందిగామ పట్టణ రూపు రేఖలు మార్చి నవ నందిగామగా తీర్చిదిద్దుతామన్నారు, సీఎం రోడ్డు విస్తరణ పనులు చేపట్టగానే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలోని పెద్ద పెద్ద మేధావులు ,పెద్ద పెద్ద మాటలు మాట్లాడారని, ఆ మేధావుల మాటలను నేను పట్టించుకోనన్నారు , ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహకారంతో నందిగాను మరింత ముందుకు తీసుకెళ్తామని , మా పనితీరును -పరిపాలనను చైతన్యవంతులైన నందిగామ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని , ఎవరు అభివృద్ధి చేస్తున్నారో – ఎవరు అభివృద్ధికి అడ్డుపడుతున్నారో ప్రజలకు పూర్తిగా తెలుసని చెప్పారు .. సీఎం రోడ్డు విస్తరణ పనులకు పూర్తి సహకారం అందించిన సీఎం రోడ్డు నివాసులకు , త్వరితగతిన పనులు పూర్తయ్యలా కృషి చేసిన మున్సిపల్ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి ఘనంగా సత్కరించారు ..

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు మాట్లాడుతూ నందిగామలో గత ఐదు ఏళ్ల ప్రతిపక్షంలో ఉన్న మేము తెలుగుదేశం పార్టీ చేస్తున్న పనులపై ఏనాడు కోర్టులకు వెళ్లి ఆపలేదని , కానీ మేము నందిగామలో అధికారంలోకి వచ్చి చేపడుతున్న ప్రతి పని పై కోర్టుకు వెళ్లి అభివృద్ధి నిరోధకులుగా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తుందన్నారు , గాంధీ జంక్షన్ అభివృద్ధిని తెలుగుదేశం పార్టీ కోర్టుకు వెళ్లి ఆపకుండా ఉంటే ఈ పాటికి నందిగామ గాంధీ సెంటర్ మరియు ప్రధాన రహదారుల రూపురేఖలు మారిపోయేవని , తెలుగుదేశం పార్టీ ఎన్ని కుట్రలు పన్నిన అభివృద్ధి ఆగదని , సీఎం రోడ్డు మాదిరిగా నందిగామ పట్టణంలో ప్రధాన రహదారులను విస్తరించి చూపుతామన్నారు, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ విమర్శలు అధికార పార్టీ మంచి పనులు చేసేలా ఉండాలి కానీ , వ్యక్తిగత విమర్శలు చేస్తూ – బురద చల్లే విధంగా మాట్లాడటం తెలుగుదేశం పార్టీ నైజానికి నిదర్శనమన్నారు, సీఎం రోడ్డుకు ఎన్టీఆర్ పేరు పెట్టడం ఆయనకు మేము -మా పార్టీ ఇస్తున్న గౌరవమని ,మంచి వ్యక్తులు ఎవరైనా – మంచి ఎవరు చేసినా వారిని గౌరవించడం మా బాధ్యత అని తెలిపారు , తెలుగుదేశం పార్టీ ఇన్నాళ్ల నందిగామ పరిపాలనలో ఏనాడు ఎన్టీఆర్ కు ఇలాంటి గౌరవం ఇవ్వలేదని – తెలుగుదేశం పార్టీకి -మాకు ఉన్న తేడాను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు ..

ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ డాక్టర్ జయరాం , ఏఈ ఫణి శ్రీనివాస్ , ఏపీ ఆగ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ మంగనురు కొండారెడ్డి , వైస్ చైర్మన్ నాగరత్నమ్మ ,కౌన్సిలర్ లు, కో ఆప్షన్ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు , మున్సిపల్ సిబ్బంది , సీఎం రోడ్డు నివాసులు పాల్గొన్నారు ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *