YSRCP Nandigama :

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.26-12-2022(సోమవారం) ..
వంగవీటి మోహన రంగా గారికి ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
బడుగు బలహీన వర్గాల కోసం అభ్యున్నతికి కృషి చేసిన నాయకుడు వి.యం.రంగా : ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
నందిగామ పట్టణంలోని అనాసాగరంలో స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు సోమవారం పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంగవీటి మోహనరంగా ఒక కులానికో ,వర్గానికో చెందినవారు కాదని అన్ని వర్గాల ప్రజా నాయకుడిని పేర్కొన్నారు , రాజకీయాల్లోకి వచ్చిన అనంతకాలంలోనే వంగవీటి మోహన రంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని , పేద-బడుగు- బలహీన వర్గాలకు ఏ ఆపద వచ్చినా నేనున్నానని ముందుకు వచ్చే మానవతావాదని చెప్పారు , పేదలకు అండగా ఉండాలనేది దిగవంత నేత రంగా ఆశయమని, రంగా ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు ..
ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కౌన్సిల్ సభ్యులు ,స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు ..