YSRCP Nandigama :
ఎన్టీఆర్ జిల్లా / నందిగామ మండలం :
ది.26-12-2022(సోమవారం) ..
రాష్ట్రంలో ప్రజారంజక పాలన ..
కమ్మవారిపాలెం గ్రామంలో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం” నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
నందిగామ మండలంలోని కమ్మవారిపాలెం గ్రామంలో సోమవారం సాయంత్రం “గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం”లో భాగంగా శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ప్రతి ఇంటికీ తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను -పనితీరును వివరించారు ,
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజారంజక పాలన సాగుతుందని , ప్రతి హామీ అమలు చేస్తూ ప్రజలకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అండగా నిలుస్తున్నారని తెలిపారు , ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చడంతో పాటు ప్రజలకు పాలనా ఫలాలు అందుతున్న తీరు తెలుసుకున్నారు ,ఇంకా సమస్యలు ఉంటే పరిష్కారానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారని ప్రజలతో నాయకులు, అధికారులు మమేకం కావడమే ముఖ్య ఉద్దేశమన్నారు ,అవినీతికి తావులేని పాలతో ప్రజలకు మేలు జరుగుతుంటే ప్రతిపక్షాలు సహించలేకపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు ,ప్రభుత్వంపై బురద చల్లి ప్రయోజనం పొందాలని కూయుక్తులు పన్నుతున్నాయని -ప్రజలకు మంచి చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు ,ఎన్ని అవంతరాలు ఎదురైనా రాష్ట్ర అభివృద్ధికి -ప్రజా సంక్షేమానికి సీఎం కట్టుబడి ఉన్నట్లు చెప్పారు ..
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెంటమాల నిర్మల-రాజేంద్ర, మాజీ సర్పంచ్ వేల్పుల కిషోర్, ఎంపీటీసీ పెసరమల్లి రమాదేవి-స్టాలిన్, మండల కన్వీనర్ శివ నాగేశ్వరరావు, నాయకులు చండ్ర కోటేశ్వరరావు, జంపాని సుబ్బారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వాలంటీర్లు ,సచివాలయ సిబ్బంది ,పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు ..