YSRCP Nandigama :

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.29-12-2022(గురువారం) ..
నందిగామ ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్న ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు, ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
అధికారంలోకి వచ్చిన నాటి నుండి నందిగామ ఆర్యవైశ్యులకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు వ్యక్తిగతంగా అన్ని విధాలుగా అండగా ఉన్నాం : డాక్టర్ మొండితోక బ్రదర్స్ ..
నందిగామ గాంధీ సెంటర్ అభివృద్ధికి – ఆర్యవైశ్యుల ఆరాధ్యులైన మహాత్మా గాంధీ, అమరజీ పొట్టిశ్రీరాములు, కొనిజేటి రోశయ్య విగ్రహాల ఏర్పాటుకు ఆర్యవైశ్యుడే హైకోర్టుకు వెళ్లి అడ్డుపడటం దౌర్భాగ్యకరం ..
నందిగామలో జరుగుతున్న అభివృద్ధిని తప్పు దోవ పట్టించేలా ప్రతిపక్షాలు -కొంతమంది వ్యక్తులు బాధాకరం ..
దేవుడు ఆశీర్వాదంతో ..ప్రజలు ఇచ్చిన అవకాశంతో మా హయాంలో నందిగామలో మా మార్క్ అభివృద్ధి చేసి తీరుతాం : ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
నందిగామ లోని ప్రధాన రహదారులు అన్నింటిని సంవత్సర కాలంలో విస్తరించి అభివృద్ధి చేసేలా చర్యలు చేపడతాం : ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
నందిగామ మెయిన్ బజార్ లో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేలా- ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ద్వారా కార్యాచరణ జరుగుతుంది .. అందరూ సహకరించాలి ..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏ ఆర్యవైశ్య వ్యాపారస్తుల పై అధికారుల దాడులు లేకుండా – గత ప్రభుత్వం లాగా వ్యాపారస్తులు నుంచి ఎటువంటి విరాళాలు వసూలు చేయకుండా మంచి పరిపాలన చేస్తున్నాం ..
ఆర్యవైశ్య భవన్ నిర్మాణానికి – ఆర్యవైశ్య హాస్టల్ ఏర్పాటుకు మా వంతు సహకారం అందిస్తాం .. ఆర్యవైశ్యులంతా సమాలోచనలు చేసుకొని మీ అభిప్రాయాలను చెబితే త్వరలోనే కార్యరూపం దాల్చేలా చర్యలు చేపడదాం : ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
ఎన్నికల వరకే రాజకీయాలు .. ఆ తరువాత అందరూ అభివృద్ధిలో భాగస్వాములై నందిగామ రూపురేఖలు మార్చటానికి సహకరించాలి ..
నందిగామలో ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ముందు చూపుతో -విజన్ తో రెవిన్యూ డివిజన్- కేంద్రీయ విద్యాలయం- వంద పడకల ఆసుపత్రి- ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ – నూతన రైతు బజార్ ఏర్పాటు – పార్కు- స్టేడియం లాంటి వ్యవస్థల ఏర్పాటుకు కార్యాచరణ చేశారు .. వాటిలో కొన్ని సాధించాం .. మరికొన్ని రానున్న అతి కొద్ది రోజుల్లోనే సాకారం అవుతాయి : ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మంచి పరిపాలన అందిస్తుంది .. ఈ ప్రభుత్వంలోనే నందిగామ అభివృద్ధి సాధ్యం ..
అధికారులతో సహా వచ్చి మీ సమస్యలు చెప్పండి పరిష్కరిస్తాం .. అంటూ పాలకులు వ్యాపారస్తుల -ఆర్యవైశ్యల దగ్గరకు రావటం హర్షణీయం : నందిగామ ఆర్యవైశ్యులు ..
శివాలయ అభివృద్ధికి -నూతన రథానికి రూ. కోటి 30 లక్షలు మంజూరు చేయించిన ఎమ్మెల్యే గారికి .. కన్యకా పరమేశ్వరి ఆలయం పక్కన గల దేవాలయ భూమిని ఆర్యవైశ్యులు శుభకార్యాలకు – దైవ కార్యాలకు వినియోగించుకునేలా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ఆర్యవైశ్యులు ..
ఎమ్మెల్యే- ఎమ్మెల్సీ సోదరులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు, డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ లను ఘనంగా సత్కరించిన నందిగామ ఆర్యవైశ్య వ్యాపారులు ..
నందిగామ పట్టణంలోని రామాలయం వద్ద గల ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో బుధవారం రాత్రి నిర్వహించిన ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనంలో పలువురు ఆర్యవైశ్య ప్రజాప్రతినిధులు , ఆర్యవైశ్య నాయకులు, ఆర్యవైశ్య వ్యాపారస్తులు పాల్గొన్నారు ..