YSRCP Nandigama

ఎన్టీఆర్ జిల్లా / చందర్లపాడు మండలం :
ది.29-12-2022(గురువారం) ..
విద్యార్థులకు ట్యాబ్ లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కార్పొరేట్ స్ధాయి విద్య : ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
చందర్లపాడు మండలం ముప్పాళ్ళ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8 వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం పంపిణీ చేసిన ఈ -ట్యాబ్ లను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు గురువారం అందజేశారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు , విద్యాభివృద్ధికి రూ.55 వేల కోట్లు ఖర్చు చేయడమే కాకుండా నాడు -నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేస్తున్నారని గుర్తు చేశారు , విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించే క్రమంలో భాగంగా 8 వ తరగతికి చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్ లు ప్రభుత్వం అందిస్తుందని , పాఠశాల స్థాయి నుంచి కమ్యూనికేషన్స్ స్కిల్స్ అందించే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని చెప్పారు ..
ఈ కార్యక్రమంలో ఎంపిపి వేల్పుల యేసమ్మ, వైస్ ఎంపిపి నల్లాని రమాదేవి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ వెలగపూడి వెంకటేశ్వరరావు , మండల కన్వీనర్ కందుల నాగేశ్వరరావు, నాయకులు యార్లగడ్డ సత్యనారాయణ ప్రసాద్, పెరమసాని నరసింహారావు, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ ,తదితరులు పాల్గొన్నారు ..