YSRCP Nandigama :

ఎన్టీఆర్ జిల్లా / అల్లూరు :
ది.30-12-2022(శుక్రవారం) ..
విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపడమే లక్ష్యం ..
అల్లూరు పాఠశాల విద్యార్థులకు ఈ-ట్యాబ్ లు & స్టడీ మెటీరియల్ అందజేసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
ముఖ్యఅతిథిగా పాల్గొన్న జడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక ..
మండలంలోని అల్లూరు గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8 వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం అందజేసిన ఈ -ట్యాబ్ లు మరియు స్టడీ మెటీరియల్ ను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు , జడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక తో కలిసి పంపిణీ చేశారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోని దానికి అనుగుణంగా విద్యలో ముందుకు సాగేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ట్యాబ్ లు అందిస్తున్నారన్నారు, రోజురోజుకు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతుందని చెప్పారు, అందుకు అనుగుణంగా విద్యార్థులకు విద్యనందించేందుకు సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే డిజిటల్ తరగతులను ఏర్పాటు చేశారని తెలిపారు, ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విప్లవం తీసుకువచ్చేందుకు బైజుస్ తో ఒప్పందం చేసుకొని ఫ్రీ లోడెడ్ కంటెంట్ తో విద్యార్థులకు అన్ని విధాలుగా ఉపయోగపడే విధంగా ట్యాబులు అందిస్తున్నట్లు తెలిపారు ..
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ , ఎంపీపీ కోటేరు లక్ష్మి ముత్తారెడ్డి, వైస్ ఎంపీపీ ఆదాం, జడ్పిటిసి అమర్లపూడి కీర్తి సౌజన్య, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షహనాజ్ బేగం, నాయకులు కోటేరు సూర్యనారాయణ రెడ్డి, మండల కన్వీనర్ ఆవుల రమేష్ బాబు , ఉప్పాల రాము తదితరులు పాల్గొన్నారు ..