YSRCP Nandigama :
ఎన్టీఆర్ జిల్లా / కంచికచర్ల టౌన్ :
ది.30-12-2022(శుక్రవారం) ..
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ..
కంచికచర్లలో పాఠశాల విద్యార్థులకు ఈ-ట్యాబ్ లు & స్టడీ మెటీరియల్ అందజేసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
కంచికచర్ల పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8 వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం అందజేసిన ఈ -ట్యాబ్ లు మరియు స్టడీ మెటీరియల్ ను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు , జడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక తో కలిసి పంపిణీ చేశారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద విద్యార్థుల సైతం ఉన్నత చదువులు చదివేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అండగా నిలుస్తున్నారని తెలిపారు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సృజనాత్మక విద్యను అందించేందుకు ఎనిమిదో తరగతి విద్యార్థులకు వైయస్ జగన్ ఈ-ట్యాబ్ లు అందజేస్తున్నారన్నారు, గత ప్రభుత్వాల పాలనలో ప్రభుత్వ పాఠశాలలో ఆదరణకు నోచుకోలేదని ఆయన గుర్తు చేశారు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సకల వసతులు, హంగులతో అభివృద్ధి చేసి చూపించారని తెలిపారు, విద్యార్థులు ప్రణాళికబద్దంగా చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు ..
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వేల్పుల సునీత శ్రీనివాసరావు, ఎంపీపీ మలక్ బషీర్, జడ్పిటిసి వేల్పుల ప్రశాంతి, మండల కన్వీనర్ నన్నపనేని నరసింహారావు తదితరులు పాల్గొన్నారు ..