YSRCP Nandigama :

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.30-12-2022(శుక్రవారం) ..
నందిగామ నగర పంచాయతీ అత్యవసర సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
చైర్మన్ మండవ వరలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో 34 అంశాలతో కూడిన అజెండాను ఆమోదించిన కౌన్సిల్ సభ్యులు ..
నందిగామ నగర పంచాయతీని గ్రేడ్- 2 మున్సిపాలిటీ గా అప్ గ్రేడ్ చేసే ప్రతిపాదనను ఆమోదించిన కౌన్సిల్ సభ్యులు ..
నందిగామ పట్టణ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నామన్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినందుకు – సీఎం రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేసి ఎన్టీఆర్ రోడ్డుగా నామకరణం చేసి నవనందిగామగా తీర్చిదిద్దుతున్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారిని ఘనంగా సత్కరించిన కౌన్సిల్ సభ్యులు ..
జీరో అవర్ లో గాంధీ సెంటర్ విగ్రహాల అంశాన్ని తెలుగుదేశం పార్టీ సభ్యులు ప్రస్తావించగా ట్రాఫిక్ కు గాంధీ సెంటర్లో విగ్రహాల ఐలాండ్ అడ్డంగా ఉందనే ఉద్దేశంతోనే, అక్కడి విగ్రహాలను తీసి వారికి సముచిత స్థానం కల్పిస్తూ నూతనంగా నిర్మించిన వేదికపై ఏర్పాటు చేసే ఆలోచన చేశామన్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన గొప్ప నేతలు ఎన్టీఆర్, వైయస్ రాజశేఖర్ రెడ్డి లని – వారి చరితను, ఘనతను ఎవరు తగ్గించలేరని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్య రంగానికి వైయస్సార్ చేసిన సేవలను గుర్తించి యూనివర్సిటీని వైయస్సార్ యూనివర్సిటీ గా మార్చారని తెలిపిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
పట్టణంలోని కోర్టు రోడ్డు – గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డుతో పాటు మిగతా ప్రధాన రహదారుల విస్తరణ పనులు త్వరితగతిన ప్రారంభించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
ఈ సమావేశంలో నగర పంచాయతీ కమిషనర్ డాక్టర్ జయరాం, ఏఈ ఫణి శ్రీనివాస్, వైస్ చైర్మన్లు మాడుగుల నాగరత్నమ్మ, ఓర్సు లక్ష్మి , కౌన్సిల్ సభ్యులు- కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు ..