YSRCP Nandigama :

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.01-01-2023(ఆదివారం) ..
నందిగామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు ..
పార్టీ నాయకులు- కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి , నియోజకవర్గ ప్రజలకు , పార్టీ నాయకులకు ,కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు , నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాలలో వెలుగులు నింపాలని కోరారు, కొత్త సంవత్సరంలో ఎదురయ్యే సరికొత్త సవాళ్లను తట్టుకొని ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని సూచించారు ..
అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారికి నియోజకవర్గ నలుమూలల నుండి కార్యకర్తలు- నాయకులు తరలివచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు, వివిధ శాఖల అధికారులు కూడా ఎమ్మెల్యే డాక్టర్ జగన్ మోహన్ రావు గారిని మర్యాదపూర్వంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు ..