YSRCP Nandigama :
ఎన్టీఆర్ జిల్లా / విజయవాడ :
ది.03-01-2023(మంగళవారం) ..
రోడ్లు & భవనాలు శాఖ ఉన్నతాధికారులను కలిసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
నందిగామ నియోజకవర్గం లోని పలు ఆర్ అండ్ బి రోడ్ల విస్తరణ మరియు నిధుల మంజూరుపై ఉన్నతాధికారులతో చర్చించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
విజయవాడ నగరంలోని రోడ్లు- భవనాలు శాఖ కార్యాలయంలో స్టేట్ హైవేస్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్ అండ్ బి చీఫ్ ఇంజనీర్ లు వేణుగోపాల్ రెడ్డి, మేజర్ డిస్టిక్ రోడ్స్ చీఫ్ ఇంజనీర్ నయాముల్లా లను నందిగామ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు కలిసి నందిగామ నియోజకవర్గంలోని రోడ్ల విస్తరణ మరియు మరమత్తుల పనులపై చర్చించారు ..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు నియోజకవర్గంలోని ప్రధాన రహదారుల మరమ్మత్తుల పనులకు నిధుల మంజూరు మరియు పలు ఆర్ అండ్ బి రోడ్ల నిర్మాణ పనులకు నిధుల మంజూరుకై, అదేవిధంగా పలు రోడ్లకు నిధులు మంజూరై టెండర్ల ప్రక్రియ దశలో ఉన్న అంశాలకు సంబంధించి ఆర్ అండ్ బి ఉన్నతాధికారులతో చర్చించినట్లు తెలిపారు ..