
YSRCP Nandigama :
ఎన్టీఆర్ జిల్లా / చందర్లపాడు :
ది.04-01-2023(బుధవారం) ..
వైయస్సార్ పెన్షన్ కానుక వారోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
కుల, మత, రాజకీయ పార్టీలు చూడకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్ మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ..
ఇక నుండి ప్రతి నెల పెన్షన్ రూ.2750/- ..
చందర్లపాడు పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన వైయస్సార్ పెన్షన్ కానుక వారోత్సవాల్లో శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు పాల్గొని నూతనంగా పెన్షన్ మంజూరైన లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో మాదిరిగా పెన్షన్ కోసం జన్మభూమి కమిటీల ముందు, తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్ళ ముందు చేతులు కట్టుకుని నిలబడే అవసరం లేకుండానే, నేరుగా లబ్ధిదారుడు ఇంటి తలుపు కొట్టి వాలంటీర్ లు ఠంచునుగా పింఛను అందిస్తున్నారని తెలిపారు, తెలుగుదేశం పార్టీ దుర్మార్గపు మీడియాను అడ్డుపెట్టుకొని పెన్షన్లను తొలగిస్తున్నారని నానా యాగి చేస్తున్నారని, కానీ ప్రతి నెల లబ్ధిదారుల సంఖ్య పెరుగుతుంది తప్ప -తగ్గటం లేదని వాస్తవాలను వక్రీకరించే విధంగా తెలుగుదేశం పార్టీ ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు, కేవలం పెన్షన్ మాత్రమే కాకుండా ప్రతి సంక్షేమ పథకం నేరుగా లబ్ధిదారుడికి చేరేలా వారి బ్యాకు ఖాతాల్లోనే డబ్బు జమ అయ్యేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డి.బి.టి విధానాన్ని అమలు చేస్తున్నారన్నారు , గతంలో సంక్షేమ పథకాలు అందజేయడంలో ఏజెంట్లు, జన్మభూమి కమిటీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కమిషన్లు వసూలు చేస్తుండేవారని, ఆ విధానానికి స్వస్తి పలికి ప్రభుత్వ వారధిగా వాలంటీర్లను నియమించి నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అర్హులను గుర్తించి సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని చెప్పారు, ప్రజల మేలు కోసం మంచి పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు ..
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కస్తాల పున్నమ్మ, జడ్పిటిసి ముక్కపాటి నరసింహారావు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ వెలగపూడి వెంకటేశ్వరరావు, ఎంపిపి వేల్పుల యేసమ్మ, మండల కన్వీనర్ కందుల నాగేశ్వరరావు, యార్లగడ్డ సత్యనారాయణ ప్రసాద్, సొసైటీ అధ్యక్షులు రాయల జానకి రామయ్య , జిల్లా సమాఖ్య మాజీ అధ్యక్షురాలు శాఖమూరి వెంకట కుమారి ,ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు ..