
YSRCP Nandigama :
ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.04-01-2023(బుధవారం) ..
నందిగామ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
“గడపగడపకు -మన ప్రభుత్వం” నిధులు రూ.40 లక్షలతో పలు సిసి రోడ్లు – డ్రైనేజీల నిర్మాణం ..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహకారంతో నందిగామ అభివృద్ధి ..
నందిగామ పట్టణంలోని 7 మరియు 8 , 9 మరియు 10 వార్డులలో “గడపగడపకు మన ప్రభుత్వం” నిధులు రూ.40 లక్షల అంచనా విలువతో చేపట్టిన పలు సిసి డ్రైనేజీలు- సిమెంట్ రోడ్ల నిర్మాణాలకు శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు బుధవారం సాయంత్రం శంకుస్థాపన నిర్వహించారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గడపగడపకు- మన ప్రభుత్వం అనే కార్యక్రమానికి ఆలోచన చేసి ప్రజా ప్రతినిధులను -అధికారులను సంయుక్తంగా ప్రజల్లోకి పంపి ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించే విధంగా కార్యచరణ రూపొందించారని తెలిపారు, నందిగామ పట్టణంలో పలు వార్డులలో గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తయిన సందర్భంగా ఆ సచివాలయాల పరిధికి నిధులు మంజూరై అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందన్నారు, గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు పరిష్కరించడంతో పాటు – వార్డు సమస్యలను కూడా పరిష్కరించే విధంగా ముఖ్యమంత్రి జగన్ పనిచేస్తున్నారని చెప్పారు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహకారంతో నందిగామ పట్టణాన్ని నవనందిగామ గా తీర్చిదిద్దుతామన్నారు, సంక్షేమం- అభివృద్ధి రెండు కళ్ళుగా పరిపాలన చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు మద్దతు ఇస్తున్నారని, గత పాలకులు దోపిడీయే లక్ష్యంగా పనిచేశారే తప్ప , నందిగామ కు చేసింది ఏమీ లేదని దుయ్యబట్టారు ..
ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ డాక్టర్ జయరాం, ఏఈ ఫణి శ్రీనివాస్, వైస్ చైర్మన్ మాడుగుల నాగరత్నం, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ గుడివాడ సాంబశివరావు, కౌన్సిలర్లు విశ్వనాథపల్లి వాణి కృపారావు, పాకాలపాటి కిరణ్, తానూరి రాము, మారం అమరయ్య, పట్టణ అధ్యక్షులు దొంతి రెడ్డి దేవేందర్ రెడ్డి, కృష్ణ బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ వీసం దుర్గారావు ,కోలేటి సుబ్బారావు ,పిల్లి జయరాజు తదితరులు పాల్గొన్నారు ..