
YSRCP Nandigama :
ఎన్టీఆర్ జిల్లా / కంచికచర్ల టౌన్ :
ది.05-01-2023(గురువారం) ..
పేదల ఆర్థికాభివృద్ధి -సంక్షేమమే వైఎస్ జగన్ ధ్యేయం ..
కంచికచర్ల పట్టణంలో గడపగడపకు- మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
కంచికచర్ల పట్టణంలో గురువారం ఉదయం గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాల క్యాలెండర్ ను అందజేస్తూ – ప్రభుత్వ పనితీరును వివరించారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్ష అని , రాష్ట్రంలో పారదర్శక ,విలువలు, విశ్వసనీయతతో కూడిన పాలన సాగుతోందన్నారు , గత ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీని అమలు చేయలేదని గుర్తు చేశారు , వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేశారని తెలిపారు ..
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వేల్పుల సునీత శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ వేమ సురేష్ బాబు ,జెడ్పిటిసి వేల్పుల ప్రశాంతి, ఎంపీపీ మలక్ బషీర్, సొసైటీ అధ్యక్షులు కాలవ పెదబాబు ,సచివాలయ సిబ్బంది -వాలంటీర్లు ,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..