YSRCP Nandigama :
ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.05-01-2023(గురువారం) ..
అంగరంగ వైభవంగా నందిగామ మార్కెట్ యార్డ్ కమిటీ ప్రమాణస్వీకారం మహోత్సవ కార్యక్రమం ..
చైర్మన్ గా ముహమ్మద్ మస్తాన్, వైస్ చైర్మన్ గా నల్లమల్లి మురళి, డైరెక్టర్లుగా 17 మంది ప్రమాణస్వీకారం ..
నందిగామ పట్టణ పురవీధులలో భారీ ఊరేగింపుగా ర్యాలీ నిర్వహిస్తూ పార్టీ శ్రేణులతో కలిసి మార్కెట్ యార్డ్ కు చేరుకున్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
ముఖ్య అతిథులుగా పాల్గొన్న గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, మాజీ మంత్రి &ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ..
సామాజిక న్యాయానికి, మహిళా సాధికారతకు పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి : వెల్లంపల్లి శ్రీనివాస్ ..
కెవిఆర్ కాలేజీలో నా సహచరుడు, రైతు బిడ్డ, మైనార్టీ సోదరుడు మహమ్మద్ మస్తాన్ మార్కెట్ యార్డ్ కి చైర్మన్ కావడం సంతోషంగా ఉంది : మంత్రి జోగి రమేష్ ..
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ కాలంలో పెద్ద పెద్ద పదవులు, యార్డ్ చైర్మన్ లు కేవలం ఒక సామాజిక వర్గానికి మాత్రమే దక్కేవి .. ఆ విధానానికి భిన్నంగా ఎస్సీ -ఎస్టీ -బీసీ- మైనారిటీలకు ఉన్నత పదవులు ఇస్తూ, వెనుకబడిన మరియు బడుగు బలహీన కులాలకు రాజ్యాధికారంలో భాగం చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే : మంత్రి జోగి రమేష్ ..
పబ్లిసిటీ కోసం, ఇరుకు సందుల్లో మీటింగ్లు పెట్టి కందుకూరు -గుంటూరు లలో 11 మందిని పొట్టను పెట్టుకున్న నరరూప రాక్షసుడు నారా చంద్రబాబు నాయుడు : మంత్రి జోగి రమేష్ ..
ప్రభుత్వంపై నిందలు వేయడానికి, ప్రజల ప్రాణాలు తీసి, గుంటూరు మీటింగ్ తో మా పార్టీకి సంబంధం లేదు అని ప్రెస్ మీట్ లు పెడుతూ రాజకీయం చేస్తున్న నీచాతినీచుడు- దుర్మార్గుడు నారా చంద్రబాబు నాయుడు : మంత్రి జోగి రమేష్ ..
నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారిని , ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో పెద్ద మెజారిటీతో గెలిపించాలి : మంత్రి జోగి రమేష్ ..
చంద్రబాబు నాయుడు కి వచ్చే ఎన్నికల్లో కుప్పంలోనే ఓడిపోతామనే భయం పట్టుకుంది, కుప్పంలో జడ్పిటిసిలు -ఎంపీటీసీలు- మున్సిపాలిటీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడంతో చంద్రబాబుకు పిచ్చెక్కి కుప్పం వెళ్లి పిచ్చిపిచ్చి వేషాలు వేస్తున్నాడు : మంత్రి జోగి రమేష్ ..
నూతన పాలకవర్గం వ్యవసాయ సమస్యలు- రైతుల సమస్యలు తీర్చే విధంగా కృషి చేయాలి : మాజీ హోం శాఖ మంత్రివర్యులు వసంత నాగేశ్వరరావు ..
మహమ్మద్ మస్తాన్ పార్టీ బలోపేతానికి, పార్టీ గెలుపుకు ఎనలేని కృషి చేశారు, మస్తాన్ విధేయతను పార్టీ గుర్తించి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి కట్టబెట్టింది : ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ..
ప్రపంచ దేశాల ప్రమాణాలకు అనుగుణంగా స్థిరాభివృద్ధిని సాధిస్తూ, దేశంలోనే సంక్షేమంలోనూ- అభివృద్ధిలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రధమంగా నిలబెట్టిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి : ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు ..