Best Web Hosting Provider In India 2024
Brahmamudi April 2nd Episode: రాజ్ తన కొడుకును తీసుకొని ఆఫీస్‌కు వెళతాడు. ఆ విషయం తెలిసి ధాన్యలక్ష్మి, రుద్రాణి గొడవ చేస్తారు. అపర్ణ కూడా రాజ్‌నే తప్పు పడుతుంది. కొడుకు కావాలో, కంపెనీ కావాలో తేల్చుకోమని అంటుంది. . కొడుకే తనకు ముఖ్యమని చెప్పిన రాజ్ కంపెనీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటిస్తాడు. తన జాబ్‌కు రిజైన్ చేస్తాడు.
బాబును ఆఫీస్‌కు తీసుకొస్తే గొడవ జరుగుతుందని తాను ముందే ఊహించారని ఇందిరాదేవితో అంటుంది కావ్య. గొడవ జరుగుతుందని తెలిసినప్పుడు పిల్లాడిని ఆఫీస్‌కు తీసుకెళ్లకుండా ఆపాల్సిందని కావ్యతో చెబుతుంది ఇందిరాదేవి. తాను ఆపాలని ప్రయత్నించానని రాజ్ ఆగలేదని కావ్య అంటుంది.
రాజ్ సమస్యకు పరిష్కారం…
రాజ్ కొడుకు సమస్య రోజురోజుకు పెద్దది అవుతోందని, రాజ్ వ్యవహారం ఏ మాత్రం అర్థం కావడం లేదని ఇందిరాదేవి బాధపడుతుంది. తనకు కొడుకు ఉన్న సంగతి ప్రాణ స్నేహితురాలైన శ్వేతకు కూడా రాజ్ చెప్పకుండా దాచాడంటే దీని వెనుక ఏదో రహస్యం దాగి ఉందని కావ్య అనుమానపడుతుంది.
ఏదో ఒకటి చేసి రాజ్ మనసులో ఉన్న నిజాన్ని బయటపెట్టించాలి… ఆ బిడ్డ కన్నతల్లి ఎవరో తెలుసుకొని ఆమెను బయటకు తీసుకొస్తేనే ఈ గొడవలకు ఓ పరిష్కారం దొరుకుతుందని కావ్య అనుకుంటుంది. ఆ పని చేసి ఇంట్లోని గొడవలను ఆపమని కావ్యను రిక్వెస్ట్ చేస్తుంది ఇందిరాదేవి.
తండ్రికి రాజ్ క్షమాపణలు…
తండ్రికి చెప్పకుండా ఉద్యోగానికి రాజీనామా చేసినందుకు సుభాష్‌కు క్షమాపణలు చెబుతాడు రాజ్. మీరు, బాబాయ్ ఎంతో కష్టపడి కంపెనీని ఈ స్థాయికి తీసుకొచ్చారని, ఎంతో నమ్మకంతో నాకు కంపెనీ బాధ్యతల్ని అప్పగించారని, కానీ మీ నమ్మకాన్ని బ్రేక్ చేశానని రాజ్ ఎమోషనల్ అవుతాడు.
నేను తీసుకున్న నిర్ణయంతో ఇంట్లో అందరిని బాధపెట్టాల్సివచ్చిందని రాజ్ అంటాడు. కానీ రాజీనామా చేయడం తప్పితే నాకు మరో దారి కనిపించడం లేదని అంటాడు. తన కొడుకు కోసం ఆస్తులు, బంధాలు, బంధుత్వాలు అన్నింటికి కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నానని తండ్రితో చెబుతాడు రాజ్.
కావ్యకు ఎండీ సీట్…
తన స్థానంలో ఎవరిని ఎండీగా చేయాలని అనుకుంటున్నారని తండ్రి సుభాష్‌ను అడుగుతాడు రాజ్. ఎవరికి అనుకోలేదని కొడుకుకు సమాధానమిస్తాడు సుభాష్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ నిర్ణయం తీసుకున్నా తప్పు అవుతుంది. ఆ నిర్ణయం ఇంట్లో మరిన్ని గొడవలకు కారణమవుతుందని భయపడతాడు సుభాష్. కళ్యాణ్‌ను ఎండీని చేయాలని అనుకున్న వాడికి బిజినెస్‌పై అంత ఇష్టం లేదు. ఇష్టం లేని పని చేయమని కళ్యాణ్‌ను బలవంతపెట్టడం కరెక్ట్ కాదు.
రాహుల్ సంగతి మీకు తెలుసు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కావ్యను ఎండీని చేయడమే మంచిదని సుభాష్‌తో చెబుతాడు రాజ్. ఎంత పెద్ద కష్టం వచ్చిన ఎదుర్కొనే కెపాసిటీ కావ్యకు ఉందని రాజ్ అంటాడు. కావ్య తప్ప ఎండీ సీట్‌కు అర్హులు ఇంట్లో ఎవరూ లేరని సుభాష్‌తో అంటాడు రాజ్. కానీ కావ్యను ఎండీ సీట్‌లో కూర్చొబెడితే అపర్ణ ఏం గొడవ చేస్తుందోనని, ఇంట్లో వాళ్లు ఎలా ఎదురుచెబుతారోనని సుభాష్ భయపడతాడు.
వారందరిని కన్వీన్స్ చేయమని తండ్రితో అంటాడు రాజ్. తన నిర్ణయం చెప్పి వెళ్లిపోతున్న రాజ్‌ను సుభాష్ ఆపేస్తాడు. కావ్యపై ఇంత ప్రేమ మనసులో దాచుకున్న నీవు పర్సనల్ విషయాల్లో ఆమెకు ఎందుకు అన్యాయం చేస్తున్నావని అడుగుతాడు.
రాజ్ కొడుకుతో కావ్య ఆటలు…
రాజ్ కొడుకు కావ్యను చూసి నవ్వులు చిందిస్తుంటాడు. నా పరిస్థితి చూసి నీకు నవ్వులాటగా ఉందా అని ఆ చిన్నారితో అంటుంది కావ్య. నువ్వొచ్చి నీకు తెలియకుండా, నీకు సంబంధం లేకుండా నా జీవితాన్ని తలకిందులు చేశావని చిన్నారితో అంటుంది కావ్య. దీనింతటికి కారణం మీ నాన్న అని కావ్య అంటుంది. ఆ చిన్నారిని ముద్దుగా కావ్య లాలించడం చూసి కళ్యాణ్ ఆనందపడతాడు.
రాజ్‌పై సెటైర్స్…
రాజ్ ఆ రూమ్‌లోకి రావడం చూసిన కావ్య నేనేం కాంప్రమైజ్ కాలేదని అంటుంది. చిన్నారిని ఆడిస్తున్నాను కదా ఏదేదో ఊహించుకోవద్దని రాజ్‌తో అంటుంది కావ్య. బాబు కోసం ఈ బొమ్మలు తెచ్చింది ఎవరని కావ్యను అడుగుతాడు రాజ్. బొమ్మలు లేకపోతే వీడు నాతో ఆడుకుంటున్నాడు. మీరు నా జీవితంతో ఆడుకున్నట్లు అని రాజ్‌పై సెటైర్ వేస్తుంది కావ్య. మీరు కంపెనీ బాధ్యతలు ఎందుకు వదిలేశారని రాజ్‌ను నిలదీస్తుందని కావ్య. తప్పలేదని కళ్యాణ్ బదులిస్తాడు.
నమ్మకం, ప్రేమ పొగొట్టుకున్నారు…
భార్య దగ్గర నమ్మకం, కన్నతల్లి దగ్గర ప్రేమ పొగొట్టుకున్నారు. ఇంట్లోవాళ్ల దగ్గర మర్యాద, ఆఫీస్‌లో గౌరవం పోగొట్టుకున్నారు. ఇన్ని పోగొట్టుకొని మీరు ఏం సాధిస్తారని రాజ్‌కు క్లాస్ పీకుతుంది కావ్య. చివరకు తండ్రి స్థానానికి కూడా ఏం చేయలేకపోతారు. ఆ చిన్నారికి తల్లిని దూరం చేశారని రాజ్‌తో అంటుంది కావ్య.
వాడి ఇంట్లో వాడినే అనాథను చేశారని రాజ్‌పై కావ్య సీరియస్ అవుతుంది. వంశపారంపర్యంగా కంపెనీ బాధ్యతలు మీకు వచ్చాయి. ఆ బాధ్యతలు స్వీకరించడానికి మీరే సమర్థులు. మీ స్థానంలో ఆ బరువును మోసే సమర్థత ఇంట్లో ఎవరికి లేదని రాజ్‌తో అంటుంది కావ్య. కంపెనీ బాధ్యతల తప్పు చేశారని రాజ్‌కు క్లాస్ ఇస్తుంది కావ్య. మీ నిర్ణయాలు తప్పుడు ఫలితాల్ని ఇస్తాయని గుర్తుపెట్టుకోమని రాజ్‌ను చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది కావ్య.
అనామిక ఆవేశం…
కంపెనీలో నేను లేని లోటు నువ్వే తీరుస్తావనే నమ్మకం ఉంది. రేపటి నుంచి నువ్వే ఎండీవని కావ్యను ఉద్దేశించి మనసులో అనుకుంటాడు రాజ్. కళ్యాణ్‌ను ఎండీ సీట్‌లో కూర్చొబెట్టడానికి ఇదే మంచి టైమ్ అనామికను రెచ్చగొడుతుంది రుద్రాణి. రాజ్ తర్వాత ఎండీ సీట్‌లో కూర్చునే అర్హత కళ్యాణ్‌కు మాత్రమే ఉందని అనామికతో అంటుంది రుద్రాణి.
కళ్యాణ్‌ను ఎండీ సీట్‌లో కూర్చునేలా అపర్ణను ఒప్పించమని అనామికతో అంటుంది. రుద్రాణి మాటలు నిజమని నమ్మిన అనామిక ఆవేశంగా అపర్ణ దగ్గరకు వెళుతుంది. నన్ను ఎండీ పదవిలో కూర్చబెడతానని ఇప్పుడు అనామికకు సపోర్ట్ చేస్తున్నావెందుకని తల్లిపై రాహుల్ కోప్పడుతాడు. మనం నేరుగా వెళ్లి ఎండీ పదవి కావాలంటే ఎవరూ ఇవ్వరనే ఈ ప్లాన్ చేసినట్లు కొడుకుతో చెబుతుంది రుద్రాణి.
రుద్రాణి, రాహుల్ నాటకం…
నువ్వు ఎండీ కావాలంటే స్వప్నను మన దారిలోకి తెచ్చుకుంటే సరిపోతుందని అంటుంది. ఇద్దరు కలిసి కొత్త డ్రామా మొదలుపెడతారు. స్వప్న కు వినపడేలా రాహుల్‌తో… నీకు కంపెనీ బాధ్యతలు అప్పగించమని చెబితే ఎవరూ తన మాటలు నమ్మరని రుద్రాణి అంటుంది.
ఇంట్లో నిన్ను సపోర్ట్ చేసేవారు నేను తప్ప ఎవరూ లేరని రుద్రాణి చెబుతుంది. అపర్ణ దగ్గరకు వెళ్లి నీకు ఎండీ సీట్ అప్పగించమని అడిగివాళ్లు ఎవరైనా ఉంటే నీకు ఆ పదవి తప్పకుండా నీకే దక్కుతుందని స్వప్నకు వినపడేలా గట్టిగా అంటుంది రుద్రాణి. అలా అడిగేవాళ్లు ఎవరూ లేరు కాబట్టి నీ ఆశలు వదులుకో అని కొడుకుకు సలహా ఇస్తుంది రుద్రాణి. వారి మాటలను చాటు నుంచి స్వప్న వింటుంది.
రాహుల్‌కు ఎండీ సీట్…
కళ్యాణ్‌ను ఎండీ అయితే అనామిక రెచ్చిపోతుందని స్వప్న రగిలిపోతుంది. ఎలాగైనా రాహుల్‌ను ఎండీ చేస్తే తాను ఇంటికి రాణిని అయిపోవడం ఖాయమని స్వప్న అనుకుంటుంది. తన భర్తను ఎండీని చేయమని అపర్ణను అడగాలని స్వప్న ఫిక్సవుతుంది.
అనామికతో స్వప్న గొడవ…
హాల్‌లో ఇందిరాదేవి, సీతారామయ్యతో పాటు అపర్ణ కూర్చొని ఉంటారు. వారి దగ్గరకు వచ్చిన అనామిక రాజ్ తప్పుకున్న ఎండీ సీట్‌లో కళ్యాణ్‌ను కూర్చోబెడితే మంచిదని అనుకుంటున్నట్లు చెబుతుంది. ధాన్యలక్ష్మి కూడా కొడుకుకే ఎండీ సీట్ ఇవ్వాలని అత్తమామలను కోరుతుంది. అప్పుడే అక్కడకు వచ్చిన స్వప్న…కళ్యాణ్‌కు ఆఫీస్ పనులపై పెద్దగా ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఎండీ సీట్‌ను రాహుల్‌కు అప్పగిస్తే మంచిదని అనామికతో గొడవకు దిగుతుంది స్వప్న.
రుద్రాణి కూడా ప్లేట్ ఫిరాయిస్తుంది. రాహుల్ చిన్నప్పటి నుంచి ఈ ఇంట్లోనే పెరిగాడు కాబట్టి అతడు ఈ ఇంటివారసుడేనని, రాహుల్‌కు బిజినెస్ చూసుకున్న అనుభవం ఉందని అంటుంది.
ఇంటి వారసుడు కాకుండా మరొకరికి ఎండీ సీట్ ఎలా అప్పగిస్తారని స్వప్నకు అనామిక బదులిస్తుంది. అనుభవం ఉన్న రాహుల్‌ను కాదని ఏ మాత్రం అనుభవం లేని కళ్యాణ్‌ను ఎండీ చేయడం కరెక్ట్ కాదని అనామికకు ధీటుగా సమాధానమిస్తుంది స్వప్న.
ఆ గొడవను ఆపిన సుభాష్…రాజ్ స్థానాన్ని భర్తీ చేసే అర్హత కావ్యకు మాత్రమే ఉందని ప్రకటిస్తాడు. అతడి నిర్ణయంతో ధాన్యలక్ష్మి, అనామిక, రుద్రాణి షాకవుతారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.